గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి దాదాపు 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మహా విషాదం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నేడు అహ్మదాబాద్ వెళ్లారు..
కాగా, ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని హృదయ విదారక విషాదంగా అభివర్ణించారు. అహ్మదాబాద్లో పెను విషాదం తనను ఎంతగానో కలచివేసిందని, మాటలు రావడం లేదని చెప్పారు. ఇది మాటలకందని మహా విషాదమని, తన హృదయం ముక్కలైందని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించేనని తెలిపారు. ఈ ప్రమాదంలో బాధితులకు సహాయం అందించేందుకు అధికారులతో టచ్లో ఉంటున్నట్టు చెప్పారు…
గుజరాత్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్లో కూలిపోయిన ఎయిరిండియా (Air India) బోయింగ్ ఏ-171లో ప్రయాణిస్తున్న 242 మందిలో 241 మంది మరణించారు. అయితే, ఒకే ఒక్కరు రమేశ్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ (Vishwash Kumar Ramesh) త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడి మృత్యుంజయుడిగా నిలిచారు. ప్రస్తుతం అతను అహ్మదాబాద్లోని సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు రమేశ్ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పరామర్శించారు..