అల్లూరి జిల్లాలో మైనింగ్ చేస్తుండగా పేలుడు.. ఆరుగురు మృతి, పలువురికి తీవ్ర గాయాలైనట్టు సమాచారం అనంతగిరి మండలం పినకోట వద్ద మైనింగ్ సమయంలో పేలుడు డీజిల్ ట్యాంకర్లు పేలడం వలే ప్రమాదం జరిగిన ప్రాథమిక నిర్దారణ..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం విషాదం జరిగింది. రోడ్డు విస్తరణ పనుల కోసం కొండను తొలగించేందుకు నిర్వహించిన జిలెటిన్ స్టిక్స్ బ్లాస్టింగ్ (పేలుడు) సమయంలో పెను ప్రమాదం సంభవించింది. ఈ ఘోర దుర్ఘటనలో ప్రయాణికులతో వెళుతున్న ఒక టిప్పర్ పేలుడు ధాటికి గాల్లోకి ఎగిరి పడింది. దీంతో ఐదుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం … జిల్లాలోని అనంతగిరి మండలం పినకోట ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా కొండను పగులగొట్టేందుకు కాంట్రాక్టర్లు, నిర్వాహకులు భారీగా జిలెటిన్ స్టిక్స్‌ను అమర్చి బ్లాస్టింగ్ పనులు చేపట్టారు. అయితే, అక్కడ పేలుడు జరుగుతున్న విషయాన్ని గమనించకుండా అటు వైపుగా వస్తున్న టిప్పర్ లారీ ఆ పేలుడు ధాటికి తీవ్ర ప్రమాదానికి గురైంది. ఈ భయానక ప్రమాదంలో లారీ డ్రైవర్, ఒక ఉపాధ్యాయుడు సహా ముగ్గురు కూలీలు మొత్తం ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పేలుడు తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జయింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు వేగంగా ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రోడ్డు పనుల నిర్వాహకుల నిర్లక్ష్యంపై దర్యాప్తును ముమ్మరం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ పనులు చేపట్టడమే ఈ ప్రాణనష్టానికి కారణమని ప్రాథమిక విచారణలో నిర్థారణ అయ్యింది..
.ఈ భయానక ప్రమాదంలో లారీ డ్రైవర్, ఒక ఉపాధ్యాయుడు సహా ముగ్గురు కూలీలు మొత్తం ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. పేలుడు తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జయింది. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, పోలీసులు వేగంగా ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రోడ్డు పనుల నిర్వాహకుల నిర్లక్ష్యంపై దర్యాప్తును ముమ్మరం చేశారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా బ్లాస్టింగ్ పనులు చేపట్టడమే ఈ ప్రాణనష్టానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది….alluri-sitarama-raju-district