అమెరికాలో భారత్ యువతి హత్య..
అమెరికాలో నివసిస్తున్న ఓ భారత యువతి దారుణ హత్యకు గురైంది. గత వారం రోజులుగా కనిపించకుండా పోయిందని పోలీసులు ప్రకటించిన 27 ఏళ్ల నికితా గోదిశాల మృతదేహం మేరీల్యాండ్‌లోని కొలంబియా నగరంలో లభ్యమైంది. ఈ హత్యకు ఆమె మాజీ ప్రియుడే కారణమని పోలీసులు ఇప్పుడు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం అతడు భారత్‌కు పరారైనట్లు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
అపార్ట్మెంట్లో లభ్యమైన మృతదేహం
ఎలికాట్ సిటీకి చెందిన నికితా గోదిశాల జనవరి 2న అదృశ్యమైందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన హోవర్డ్ కౌంటీ పోలీసులు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సంచలన విషయాలు వెల్లడించారు. నికితా మృతదేహం ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (26) నివాసం ఉంటున్న కొలంబియా అపార్ట్మెంట్లో లభ్యమైందని తెలిపారు. మృతదేహంపై కత్తిపోట్ల గాయాలు కూడా ఉండటంతో హత్య జరిగినట్లు నిర్ధరించారు..
అయితే కొత్త ఏడాది వేడుకల తర్వాతి నుంచి ఆమె కనిపించడం లేదు. ఆ తర్వాత ఆమె ప్రియుడు అర్జున్ శర్మ (26) నికిత కనిపించడం లేదని పోలీసులకు చెప్పాడు. తాను చివరిసారిగా ఆమెను ఎల్లికాట్ సిటీలో డిసెంబర్ 31న చూశానన్నాడు. అది అతడు ఉంటున్న అపార్ట్‌మెంటే. జనవరి 2న అతడు ఇండియాకు పారిపోయిట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత అధికారులు సెర్చ్ వారెంటు జారీ చేశారు. చివరికి అతడి అపార్ట్మెంటును సెర్చ్ చేయగా నికిత మృతదేహం దొరికింది.
డిసెంబర్ 31న రాత్రి తర్వాత ఆమె మాజీ ప్రియుడైన అర్జున్ హత్య చేసినట్లు స్పష్టమయ్యింది. కానీ అతడు ఎందుకు హత్య చేశాడనే దానిపై క్లారిటీ లేదు. భారత్‌కు పారిపోయిన అర్జున్ను గుర్తించేందుకు పోలీసులు ఫెడరల్ అధికారులు సాయం కోరారు. అలాగే నికిత స్నేహితులు కూడా ఆమె కోసం గాలించారు. చివరికి ఆమె హత్యకు గురైందని తెలియడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959