అమెరికాలో రోడ్డు ప్రమాదం మహబూబాబాద్ యువతులు మృతి..
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన మృతి
ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో, శోకసంద్రంలో యువతుల కుటుంబ సభ్యులు..
అమెరికాలోనే మరో ఘటన.
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి అరెస్ట్.
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ విద్యార్థి అరెస్ట్ అయ్యాడు. కుటుంబ సభ్యులపై పలుమార్లు దాడికి పాల్పడటంతో, సొంత ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. డల్లాస్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చదువుతోన్న 22 ఏండ్ల భారత సంతతికి చెందిన విద్యార్థి మనోజ్ సాయి లెల్లా, తరచూ కుటుంబ సభ్యులపై ఉగ్ర బెదిరింపులకు దిగుతూ, దాడి చేస్తున్నాడు. అంతేకాదు ఇంటికి కూడా నిప్పు పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో మనోజ్పై కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు మనోజ్ సాయి లెల్లాను ఫ్రిస్కో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, మనోజ్ గత కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టారు..
గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959