తెలంగాణ శాసనసభ, శానసమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత వచ్చారు. అయితే, ఆ కొద్దిసేపటికి ఆయన హైదరాబాద్లోని నందినగర్లోని తన ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండా లక్ష్మణ్ రెడ్డి మృతి పట్ల శాసనసభ సంతాపం తెలిపింది..
*అసెంబ్లీ లో కేసీఆర్ ని కలిసిన సీఎం రేవంత్ రెడ్డి*
. జాతీయ గీతంతో సభ ప్రారంభమైంది. అనంతరం తొలిరోజు సభలో ఇటీవల కన్నుమూసిన మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్రెడ్డి (తుంగతుర్తి), కొండా లక్ష్మారెడ్డి (చేవెళ్ల)లకు సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి నివాళులు అర్పించారు. వారు చేసిన సేవల్ని ఈ సందర్భంగా సభ్యులు స్మరించుకున్నారు. దివంగత నేతల కుటుంబాలకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆకాంక్షించారు..
మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభత్వ విప్ లు బీర్ల ఐలయ్య, ఆది శ్రీనివాస్ పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీపీఐ ఎమ్మెల్యే కునమనేని సాంబశివరావు.
నూతన ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కెసిఆర్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు..
నూతన సంవత్సర వేడుకలు ఉండటతో డిసెంబర్ 30 నుండి జనవరి 1 వరకు సెలవు ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. నేడు సభ వాయిదా పడిన తర్వాత జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో సభ ఎన్ని రోజుల పాటు నిర్వహించనున్నారనే దానిపై స్పష్టత రానుంది. ఈ శీతాకాల సమావేశాలు 3, 4 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. అయితే కనీసం పది రోజుల నుంచి రెండు వారాలపాటు సభలో అన్ని అంశాలపై చర్చకు బీఆర్ఎస్ కోరుతోంది..