అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత….అసెంబ్లీని ముట్టడించిన మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు..!

పెండింగ్ బిల్స్ విడుదల చేయాలంటూ తెలంగాణ అసెంబ్లీ ముందు ఆందోళనకు దిగిన మాజీ సర్పంచులు..

అసెంబ్లీని ముట్టడించిన మాజీ సర్పంచ్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు..

మాజీ సర్పంచ్‌లకు రూ. 531 కోట్ల బిల్లులను చెల్లించని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మాజీ సర్పంచులు…

హైదరాబాద్‌లోని తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు..
తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం, జేఏసీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచులు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. కాగా, సర్పంచ్‌లు అసెంబ్లీని ముట్టడించే అవకాశం ఉండడంతో ముందస్తుగా కూడా పలువురు మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు..

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో తెలంగాణలోని అన్ని జిల్లాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున పలువురు మాజీ సర్పంచులను పోలీసులు బీఆర్‌ఎస్ నాయకులు, ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు…ముందస్తు అరెస్టులపై స్పందించిన పోలీసులు, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్త చర్యలుగా అరెస్టులు చేశామని స్పష్టం చేశారు..

గమనిక..
A TO Z వార్తలు ఏదైనా..
మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959