నాగార్జునసాగర్‌లో ఏపీ జలదోపిడీ..గురువు కోసమో మోదీ కోసమో భయపడి తెలియనట్టు రేవంత్ నటిస్తున్నారు.. కేటీఆర్..
నాగార్జునసాగర్‌లో ఏపీ జలదోపిడీ
ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలపై కేటీఆర్ ఫైర్..
నాగార్జునసాగర్‌లో అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం సొరంగం తవ్వి నీళ్లను దోచుకుంటుంది..
తాగునీటి పథకం పేరు చెప్పి ఏపీ ప్రభుత్వం అక్రమంగా సాగునీటిని కూడా ఎత్తుకుపోతుంది..
ఆంధ్ర ప్రభుత్వం నాగార్జునసాగర్ నుంచి 1,600 కిలోమీటర్ల సొరంగం పైప్‌లైన్ నిర్మిస్తుంది..
కేఆర్ఎంబీ అనుమతులు లేకున్నా ఏపీకి మోదీ ఆశీస్సులు ఉన్నాయని పనులు చేస్తున్నారు
కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కలిసి నాగార్జునసాగర్ ప్రాజెక్టును తెలంగాణకు కాకుండా చేస్తున్నారు
9 టీఎంసీల నీళ్లను ఏపీ తీసుకుపోతుంటే.. ముఖ్యమంత్రులు, మంత్రులు ఏం చేస్తున్నారు?
ఓట్లు వేసిన నల్గొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు రేవంత్ ద్రోహం చేస్తున్నాడు..
8 మంది తెలంగాణ బీజేపీ ఎంపీలు ఉన్నారు.. రాష్ట్ర నీటి హక్కులపై ఎందుకు మాట్లాడట్లేదు?..
నాకు తెలిసి రేవంత్ కనుసన్నల్లోనే నాగార్జునసాగర్ దగ్గర ఏపీ ప్రభుత్వం సొరంగం తవ్వుతుంది
గురువు కోసమో మోదీ కోసమో భయపడి తెలియనట్టు రేవంత్ నటిస్తున్నారని నాకు అనిపిస్తుంది
సాగర్‌ను దోచుకుంటామంటే బీఆర్ఎస్ ఊరుకోదు.. కేఆర్ఎంబీకి బీఆర్ఎస్ తరఫున లేఖ రాస్తాం..
ఈ జలదోపిడీని అడ్డుకునేందుకు మేము న్యాయపోరాటాలు చేస్తాం, బహిరంగ సభలు పెడతాం...
హైదరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల కోసం కృష్ణా నదిలో డ్రింకింగ్ వాటర్ కోసం ఎలాంటి నిల్వలను కేటాయించారో దాని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేఆర్ఎంబీ వద్ద ఏపీ నీటి తరలింపుల మీద ఏమైనా నిరసన తెలిపారా? మీరు ఇష్టానుసారంగా నీళ్ల దోపిడీకి పాల్పడితే బీఆర్ఎస్ ఊరుకోదు.. అవసరమైతే ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ జలదోపిడీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో న్యాయ పోరాటాలు చేస్తామని పేర్కొన్నారు. బహిరంగ సభలు పెట్టి కృష్ణా నది పరివాహక ప్రజలను చైతన్యవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు..