వాడిన నూనెను కిలో 20 రూపాయల కు విక్రయిస్తున్న కేటుగాళ్లు..!

వాడిన నూనెను కిలో 20 రూపాయల కు కేటుగాళ్లుకు విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు కల్తీ నూనెలు సేకరిస్తున్న ముఠా వాటిని వీధి వ్యాపారులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ దందా నగరవ్యాప్తంగా జరుగుతున్న ఇప్పటివరకు పోలీసుల కంట పడకపోవడం విడ్డూరంగా ఉంది. నాచారంలో కల్తీ నూనెలు శుద్ధి చేసి ప్యాకెట్లలో నింపి తిరిగి అవే హోటళ్లకు విక్రయిస్తున్నారు. మాదాపూర్‌లో హోటళ్లలో వాడిన నూనెలు అక్రమంగా సేకరిస్తున్న ముఠాను టీపీవైసీ రాష్ట్ర సోషల్ మీడియా కో-కన్వీనర్ దుర్గం శ్రీహరి గౌడ్ గుర్తించారు. మాదాపూర్‌ పోలీస్ లకు సమాచారం అందించడంతో భోజన ప్రియులు నిర్వాంత పోయారు. స్థానిక రెస్టారెంట్ల నుండి వాడిన వంట నూనెను అక్రమంగా సేకరించి, తిరిగి విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానాస్పద కే ఏ 53ఏఏ 8482 గల ఆటో ను పరిశీలించగా సుమారు 20 కల్తీ నూనెలు నింపిన డబ్బాలు గుర్తించారు…అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఆటో ను శ్రీహరి గౌడ్ గుర్తించారు. వాహనాన్ని నడుపుతున్న వ్యక్తులను పోలీసులకు అప్పగించారు. వాడిన నూనెను ఎందుకు సేకరిస్తున్నారని ప్రశ్నించారు. మొదట, ఆ వ్యక్తులు స్పష్టత లేని సమాధానాలు ఇచ్చారు, కానీ తరువాత తాము రెస్టారెంట్ల నుండి లీటరుకు సుమారు ₹20 చొప్పున వాడిన నూనెను సేకరించి, వీధి వ్యాపారులకు లీటరుకు దాదాపు ₹70 చొప్పున తిరిగి అమ్మి, ₹50 లాభం పొందుతున్నట్లు అంగీకరించారు.ఇలాంటి కార్యకలాపాలకు అనుమతులు చూపించమని అడిగినప్పుడు, ఆ వ్యక్తులు సరైన పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారు. ఇందుకు సంబంధించిన ఆటో కర్ణాటకలో రిజిస్టర్ అయి ఉంది. ప్రజారోగ్యానికి హాని కలిగించే వంటనూనెలు సేకరించడంపై శ్రీహరి గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే స్పందించి మాదాపూర్ పోలీసులు, ఎస్ఓటీ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కల్తీ నూనెలు సేకరిస్తున్న ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కల్తీ నూనెను సేకరిస్తున్న ముఠా మొత్తాన్ని అరెస్టు చేయాలని శ్రీహరి గౌడ్ డిమాండ్ చేశారు.