కొండగట్టులో టీటీడీ నిర్మిస్తున్న భక్తుల వసతిగృహ శిలాఫలకాల విషయం లో ఏపీ ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు..శిలాఫలకాలపై టీటీడీకి సంబంధం లేని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పే రు పెడతామంటున్నారని అసంతృప్తిని వ్యక్తంచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో ఆమె చిట్‌చాట్ చే శారు. కొండగట్టులో రెండు శిలాఫలకాలు ఏర్పాటుచేసి ఒకదానిపై తెలంగాణ, మరోదానిపై ఏపీ వాళ్ల పేర్లు పెడితే అభ్యంతరం లేదని ప్రకటించారు.
వేటు తప్పదు
ధూపదీప నైవేద్యం పథకంపై ఆడిట్ జరుగుతున్నదని, త్వరలో చాలామందిపై వేటు పడుతుందని మంత్రి వెల్లడించారు. యాదాద్రి బోర్డు ఫైల్ సీఎం దగ్గర ఉందని, ఆయనే నిర్ణయం తీసుకుంటారని, మేడా రం పనులన్నీ మంత్రులు సీతక్క, పొంగులేటే చూస్తున్నారని, తన శాఖలకే తాను ప రిమితమవుతున్నానని మంత్రి తెలిపారు…