ఏపీ కేబినెట్ భేటీ (AP Cabinet Meeting) సచివాలయంలో ఇవాళ(బుధవారం) ఉదయం 11 గంటలకు జరుగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకోనున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఏపీ కేబినెట్ ఆమోదించనున్నారు. హెచ్వోడీ 4 టవర్ల టెండర్లకు గ్రీన్సిగ్నల్ ఇవ్వనున్నారు. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వనున్నారు సీఎం చంద్రబాబు. 9 అంశాలు అజెండాగా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు…
ఏపి క్యాబినెట్ సమావేశ ముఖ్యాంశాలు..
▪️సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం.
▪️వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయతీల కల్పనకు క్యాబినెట్ ఆమోదం.
▪️రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ కు ఆమోదం.
▪️కుప్పంలో రూ.8.22 కోట్లు వయబిలిటి గ్యాప్ ఫండ్ విడుదలకు ఆమోదం.
▪️సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకే కేబినెట్ ఆమోదం. 1 ఫిబ్రవరి 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు.
▪️248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు ఆమోదం.
▪️వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు కేబినెట్ ఆమోదం.
▪️పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం.
▪️మహిళలు రాత్రిపూట కూడా పనిచేసే చట్టసవరణకు ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి..