ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న మురసు తీవ్ర తుఫాన్
గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న తుఫాన్
నెల్లూరుకు 80 కిలోమీటర్ల దూరంలో తుఫాన్
కావలికి 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం
ఒంగోలుకు 110 కిలోమీటర్ల దూరంలో తుఫాన్
ఈ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున తీరందాటే అవకాశం..
ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం
బాపట్ల, కృష్ణా తీర ప్రాంతాల్లో ఉప్పెన వచ్చే అవకాశం..
తీరం దాటే సమయంలో 100-120 కి.మీ. వేగంతో గాలులు..
పలు ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు
ప.గో, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం..
మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు
అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ ‘మురసు’ ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకొస్తోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. నవంబర్ 2వ తేదీ అర్ధరాత్రి నుంచి నవంబర్ 3వ తేదీ తెల్లవారుజాము మధ్య ఒంగోలు సమీపంలో తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. గత ఆరు గంటలుగా తుఫాన్ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని పేర్కొంది…..
ఈ తీవ్ర తుఫాన్ కదలికలపై ఆర్టీజీఎస్, విపత్తుల నిర్వహణ సంస్థ సమన్వయంతో నిరంతరం పర్యవేక్షణలో ఉన్నట్టు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ తుఫాన్ నెల్లూరుకు 160 కిమీ, చెన్నైకి 180 కిమీ, కావలికు 180 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉందని.. ఒంగోలుకు 210 కిమీ, మచిలీపట్నానికి 240 కిమీ దూరంలో కేంద్రీకృతమైందన్నారు. దీని ప్రభావంతో తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని.. సముద్రం కూడా అల్లకల్లోలంగా మారే ఛాన్స్ ఉందని.. మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వెళ్ల వద్దని సూచించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు…