సోషల్ మీడియా నియంత్రణ, పర్యవేక్షణ, అంశాలపై పరిశీలనకు మంత్రుల కమిటీ ఏర్పాటు..!

*సోషల్ మీడియా నియంత్రణ, పర్యవేక్షణ, అంశాలపై పరిశీలనకు మంత్రుల కమిటీ ఏర్పాటు.

సోషల్‌ మీడియా చుట్టూ తిరుగుతున్నాయ్ ఏపీ రాజకీయాలు. నోటీసులు, అరెస్ట్‌లు.. విమర్శలు, ప్రతివిమర్శలు.. ఎక్కువ అయ్యింది..

సోషల్ మీడియాలో పెద్ద వ్యక్తులను టార్గెట్ చేస్తూ విపరీతంగా తిడుతున్న ధోరణి అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న కారణంగా.. దీనిని నియంత్రణ, బాధ్యత, పౌర హక్కుల రక్షణ వంటి అంశాలపై సమగ్ర పరిశీలన చేయడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

*ఈ కమిటీలో ఉన్న మంత్రులు*

▪️నారా లోకేష్
▪️సత్యకుమార్ యాదవ్
▪️కొలుసు పార్థసారథి
▪️నాదెండ్ల మనోహర్
▪️వంగలపూడి అనిత

*కమిటీ ముఖ్య బాధ్యతలు*

▪️భారత్‌లో సోషల్ మీడియా కోసం ఉన్న చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలను సమీక్షించడం.
▪️అమలులో ఉన్న లోపాలు, బాధ్యత, అమలు పద్ధతులలో తేడాలను గుర్తించడం.
▪️అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేసి, పారదర్శకత, ప్లాట్‌ఫార్ముల బాధ్యత, వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై విశ్లేషణ చేయడం.
▪️హానికర కంటెంట్, తప్పుడు సమాచారం, ఆన్‌లైన్ దాడులు, జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్న అంశాలను నియంత్రించడానికి సూచనలు ఇవ్వడం.
▪️ఫిర్యాదులు పరిష్కరించడానికి స్పష్టమైన విధానం సూచించడం.
▪️పౌరుల హక్కుల రక్షణపై సలహాలు ఇవ్వడం.
▪️పర్యవేక్షణ కోసం ప్రత్యేక సంస్థల ఏర్పాటు/బలపరచడం ప్రతిపాదించడం.

*కమిటీ వీలైనంత త్వరగా తమ సూచనలను ప్రభుత్వానికి అందించాలి.*.

ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు సోషల్‌మీడియా చుట్టే తిరుగుతున్నాయ్. హద్దులు దాటి పోస్టులు చేస్తూ.. బూతులతో టార్గెట్ చేస్తూ.. కుటుంబాలను లాగుతున్న సోషల్‌ మీడియా జాదూలకు.. ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇక అటు వైసీపీకి చెందిన కొందరు నేతలను కూడా అరెస్ట్ చేశారు..