నేటి పంచాంగం..విజయదశమి మరియు శమీ పూజ విధానం…!

ఓం శ్రీ గురుభ్యోనమః
పంచాంగం.
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 02 – 10 – 2025,
వారం … బృహస్పతివాసరే ( గురువారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
ఆశ్వయుజ మాసం,
శుక్ల పక్షం,

తిథి : *దశమి* మ2.41 వరకు,
నక్షత్రం : *ఉత్తరాషాఢ* ఉ6.11 వరకు,
తదుపరి *శ్రవణం*
యోగం : *సుకర్మ* రా9.44 వరకు
కరణం : *గరజి* మ2.41 వరకు
తదుపరి *వణిజ* రా2.37 వరకు,

వర్జ్యం : *ఉ10.17 – 11.56,*
దుర్ముహూర్తము : *ఉ9.52 – 10.39,*
‌ మరల *2.37 – 3.25,*
అమృతకాలం : *రా8.09 – 9.48,*
రాహుకాలం : *మ1.30 – 3.00,*
యమగండం : *ఉ6.00 – 7.30,*
సూర్యరాశి : కన్య,
చంద్రరాశి : మకరం,
సూర్యోదయం : 5.54,
సూర్యాస్తమయం: 5.48,

*_నేటి విశేషం_*

*విజయదశమి మరియు శమీ పూజ*
నవ రాత్రులలో నవ దుర్గలను పూజించు కున్నాము కదా!

విజయ దశమి రోజున అపరాజితాదేవి ని శమీవృక్షం దగ్గర పూజించుకొని సమాప్తం చేస్తారు.

దుర్గాదేవికి ఉన్న అనేక నామాల్లో ‘అపరాజిత’ ఒకటి.

‘అపరాజిత’ అంటే పరాజయం లేనిది అని అర్థం.

విజయానికి ఆమె అధిదేవత.

పూర్వకారంలో మహారాజులకు ఆమె ఆరాధ్య దైవం.

రాక్షసత్వం మీద దైవత్వం, చెడు మీద మంచి విజయం సాధించిన రోజు విజయదశమి.

ఈ రోజున ఏది ప్రారంభించినా విజయం తథ్యం అని పురాణాలు పేర్కొంటున్నాయి.

అలాంటి విశిష్టమైన విజయదశమి నాడు అపరాజితా దేవిని ఆరాధిస్తే విజయం సంప్రాప్తిస్తుంది.

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

అని అపరాజితా స్తోత్రం పేర్కొంటోంది.

అన్ని జీవుల్లోనూ అపరాజితాదేవి శక్తి రూపంలో ఉంటుంది.

జీవుల కర్మలను ఆమె గమనిస్తుంది.

సత్కర్మలు ఆచరించేవారిని కటాక్షిస్తుంది.

‘సర్వ కామార్థ సాధనం అపరాజితా పూజనం’ అని చింతామణి గ్రంథకారుడు పేర్కొన్నాడు.

ఆమెను ఆరాధిస్తే కోరినవన్నీ సిద్ధిస్తాయి.

*అపరాజితా స్తోత్రం*

నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః।

నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్।।

రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః।

జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః।।

కల్యాణ్యై ప్రణతా వృద్ధ్యై సిద్ధ్యై కుర్మో నమో నమః।

నైరృత్యై భూభృతాం లక్ష్మ్యై శర్వాణ్యై తే నమో నమః।।

దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై।

ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః।।

అతిసౌమ్యాతిరౌద్రాయై నతాస్తస్యై నమో నమః।

నమో జగత్ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు క్షాంతిరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు లజ్జారూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు స్మృతిరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

యా దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

ఇంద్రియాణామధిష్ఠాత్రీ భూతానాం చాఖిలేషు యా।

భూతేషు సతతం తస్యై వ్యాప్త్యై దేవ్యై నమో నమః।।

చితిరూపేణ యా కృత్స్నమేతద్ వ్యాప్య స్థితా జగత్।

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః।।

ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) రోజున అపరాజితా దేవిని పూజించి, శమీ పూజ చేయాలని శాస్త్రవచనం.

*పాపాల్ని నాశనం చేసే చెట్టు శమీవృక్షం*

విజయదశమి రోజున శమీ వృక్షం (జమ్మి చెట్టు) వద్ద అపరాజితా దేవిని పూజించి…

శమీ శమయతే పాపం
శమీ శత్రువినాశనీ।

అర్జునస్య ధనుర్ధారీ
రామస్య ప్రియదర్శనం।।

అనే శ్లోకం పఠించి, ఆ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయనీ,

అమ్మవారి కృపా కటాక్షాలు లభించి,

శుభ ఫలితాలు ఒనగూరుతాయనీ పెద్దలు చెబుతారు.

శమీవృక్షంలో అపరాజితా దేవి కొలువై ఉంటుందని విశ్వాసం.

‘శమీ’ అంటే ‘శమింపజేసేది’ అని అర్థం.

పవిత్రమైన ఈ వృక్ష ప్రస్తావన పురాణాల్లో విస్తారంగా ఉంది.

క్షీరసాగర మథనంలో ఉద్భవించిన దేవతా వృక్షాల్లో శమీ వృక్షం ఒకటనీ,

రావణాసురుణ్ణి వధించడానికి ముందు అపరాజితా దేవినీ, శమీ వృక్షాన్నీ రాముడు పూజించాడనీ పురాణ కథనం.

అలాగే పాండవులు అజ్ఞాతవాసాన్ని ప్రారంభించడానికి ముందు శమీవృక్షం పై వారి ఆయుధాలను.

*_🌿శుభమస్తు🌿_*
🙏 సమస్త లోకా సుఖినోభవంతు 🙏