బాలకోట్‌ ఆపరేషన్‌ సభ్యులతో.. ఐఏఎఫ్‌ చీఫ్‌ విన్యాసాలు

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)లోని బాలకోట్‌లో ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేన మెరుపుదాడులు జరిపి శనివారం నాటికి సరిగ్గా రెండేండ్లు.

ఈ నేపథ్యంలో భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) చీఫ్ ఆర్‌కేఎస్‌ భదౌరియా, బాలకోట్ ఆపరేషన్స్‌లో పాల్గొన్న పైలట్లతో కలిసి పలు యుద్ధ విమానాలతో విన్యాసాలు నిర్వహించారు. అలాగే నాటి దాడులను తలపించేలా డమ్మీ లక్ష్యాలపై బాంబుల వర్షం కురిపించారు.