ఇటీవల నటుడు శివాజీ హీరోయిన్ ల దుస్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలు పెనుదుమారంగా మారిన విషయం తెలిసిందే..కొంత మంది మహిళలు శివాజీ వ్యాఖ్యలకు సపోర్ట్ చేయగా, మరికొంత మంది సెలబ్రీటీలు మాత్రం ఆయన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఒకరి డ్రెస్సింగ్ సెన్స్ ను ఏవిధంగా జడ్జ్ చేస్తామని శివాజీకి కౌంటర్ లు వేశారు.ఈ వివాదం నేపథ్యంలో శివాజీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళ కమిషన్ ముందు హజరై సారీ చెప్పారు. అదే విధంగా తన వివరణ కూడా ఇచ్చారు…అయితే.. తాజాగా.. ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్.. చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర వివాదంగా మారాయి. ఆ నీచుడు ఏకంగా హిందు దేవుళ్లను, ప్రవచన కర్త గరిక పాటిశ్రీనివాస్ రావు గారిని శివాజీ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదంలోకి లాగాడు. శివాజీ వ్యాఖ్యల్ని పూర్తిగా యూట్యూబర్ తప్పుపట్టాడు. అసలు హీరోయిన్లు బోల్డ్ గా డ్రెస్సింగ్ లు వేసుకొకుంటే ఎవరు సినిమాలు చూస్తారంటూ నీచంగా మాట్లాడాడు. అంతటితో ఆగకుండా.. ప్రవచన కర్త గరికపాటి గురించి నీచంగా మాట్లాడారు.
రామాయణం, మహాభారతం గురించి కూడా మాట్లాడుతూ.. మనం దేవతలుగా కొలిచే సీతమ్మ తల్లి, ద్రౌపది ల గురించి కూడా చాలా జుగుప్సాకరంగా మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి.వెంటనే నా అన్వేషన యూట్యూబర్ ను ఇండియాకు రప్పించాలని హిందు సంఘాలు పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి..
వీరిని ఇలానే వదిలేస్తే మన దేవుళ్లను టార్గెట్ చేసుకుని, సనాతన ధర్మం గురించి మరింత పేట్రేగిపోయి నీచంగా మాట్లాడే అవకాశం ఉందని హిందు సంఘాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి. విదేశాల్లో ఉన్నాం.. మమ్మల్ని ఎవరు ఏంచేస్తారులే అని .. ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లుకూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. మొత్తంగా యూట్యూబర్ నా అన్వేషణ గాడి వివాదం ఇన్ స్టాలో ట్రెండింగ్ గా మారింది..
చాలామంది యూట్యూబర్ అన్వేష్ పై కామెంట్స్ పెడుతున్నారు…
నోటికి ఎంత వస్తే అంతే పెద్దాలేదు చిన్నా లేదు… మతం లేదు కులం లేదు… భారతదేశంపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేయడం కూడా వీడియో కాల్ లో వైరల్ గా మారాయి…..
గతంలో కూడా.
బుద్దిఉన్నవాడు ఎవడైనా పాకిస్థాన్‌తో యుద్దం చేస్తాడా అంటూ నోరుపారేసుకున్నాడు యూట్యూబర్ అన్వేష్. నోరు ఉంది కదా అని నోటికొచ్చినట్టు పేరుతూ ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యక్తిగా మారిన ప్రపంచ యాత్రికుడు, నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్.. ఇండియన్ ఆర్మీని తక్కువ చేసి మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి ఘటనలో ఇండియన్ ఆర్మీదే తప్పంటూ.. ఓ పనికి మాలిన ఉదాహరణతో తన మేధావితనాన్ని చూపించాడు యూట్యూబర్ అన్వేష్. అయితే అన్వేష్ వాగిని వాగుడుపై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు ఇండియన్స్..
శత్రుదేశానికి మొదటి నుంచి దొంగదెబ్బ తీయడమే అలవాటు. కానీ ఇండియన్ ఆర్మీ చెప్పిమరీ దెబ్బకి దెబ్బ తీస్తుంది. పహల్గాం ఉగ్రదాడికి గట్టిగానే బదులిస్తూ.. పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలపై మెరుపుదాడి చేసింది ఇండియన్ ఆర్మీ. మంగళవారం అర్థరాత్రి ఒంటిగంట 44 నిమిషాలకు శత్రుదేశంపై ఉక్కుపాదం మోపుతూ.. ఉగ్రమూకల్ని మట్టుపెట్టింది ఇండియన్ ఆర్మీ. ‘ఆపరేషన్ సిందూర్’.. పేరుతో దాయాది దేశంలో ఒకేసారి 9 ఉగ్రస్థావరాలపై ముప్పేట దాడి చేసి కశ్మీర్ నేలను తాకిన ప్రతి రక్తపు బొట్టుకు బదులిచ్చింది. మరోసారి భారత్‌పై దాడి చేయడం కాదు.. దాడి చేయాలనే ఆలోచన వచ్చినా సైలెంట్‌గా కాదు సైలెన్సర్లు మోగించి మరీ శత్రుదేశాల గుండెల్లో మిస్సైళ్లు దింపుతామని ప్రపంచ దేశాలకు గట్టి సంకేతాలనే ఇచ్చింది ఇండియన్ ఆర్మీ..అలాంటి ఆర్మీ గురించి.. తాను పుట్టిన భారతదేశం గురించి చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ వీడియో చేసిన నా అన్వేషణ యూట్యూబర్ అన్వేష్‌పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు ఇండియన్స్. పాకిస్థాన్‌కి గట్టిగానే బదులివ్వబోతున్నాం అని.. యుద్ధం ఉండబోతుందని హెచ్చరికల నేపథ్యంలో.. అసలు యద్ధమే ఉండదంటూ ఇండియన్ ఆర్మీ గురించి భారత దేశం గురించి నోటికొచ్చినట్టు పేలాడు అన్వేష్. ప్రపంచంలోనే లంచగొండి దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశమే అంటూ.. పహల్గాం ఉగ్రదాడికి కారణం ఇండియన్ ఆర్మీనే అంటూ సంచలన కామెంట్స్ చేశాడు అన్వేష్..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చెబుతున్నది ఒకటే నినాదం..
అన్వేషన యూట్యూబర్ ను unsubscribed చేయండి…
https://www.instagram.com/reel/DSuCquZkx24/?igsh=eTJya2luc2xiMjFm
మీరు మీ నిజాయితీని చాటుకోండి అంటూ పోస్ట్‌లు చేస్తున్నారు.. అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన అన్వేషన యూట్యూబర్ దేవుడే చూసుకుంటాడని వదిలేస్తే కరెక్ట్ కాదేమో అని పలువురు అభిప్రాయం.. మన వంతుగా మనం ఇలాంటి వారిని దూరం పెట్టడం కరెక్టు.. చట్టపరమైన చర్యలు తీసుకొని మరొకరికి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా చేయాలి..