ఆటో డ్రైవర్ అకాల మరణం,, దహన కార్యక్రమానికి సహాయం..!

నల్గొండ జిల్లా……..

చందంపేట మండలం తేల్ దేవర్ పల్లి లో విషాదం చోటు చేసుకుంది సభావట్ వినోద్ కుమార్ (24) తండ్రి వశయ నాయక్ గుండెపోటుతో మృతి
వినోద్ కుమార్ కు ఇద్దరు చిన్న పిల్లలు కుటుంబ పోషణకై హైదరాబాదులో ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు..

బీద కుటుంబంలో జీవనం కొనసాగిస్తూ కుటుంబ పోషణ కొనసాగిస్తున్నాడు గుండెపోటుతో మృతి చెందడంతో ఊరిలో విషాదం చోటుచేసుకుంది..

చిన్న వయసులో గుండెపోటుతో చనిపోవడం గ్రామస్తులు శోకసముద్రంలో మునిగిపోయినారు.
దేవరకొండ ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ రాము చౌహన్
దహన కార్యక్రమానికి మానవ దృక్పథంతో 5000 ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు…

దేవరకొండ బ్రాంచ్ మేనేజర్ రాము చౌహన్, చందంపేట మాజీ ఎంపీపీ ముఖ్య సలహాదారులు చందు నాయక్, మాజీ ఎంపీటీసీ మహా లక్ష్మయ్య, పాపా నాయక్, నేనావత్ పికనాయక్, సభావట్ శక్రు నాయక్ తదితరులు సంతాపం తెలియజేసినారు..

సేకరణ..
వేణు.. సీనియర్ జర్నలిస్ట్.