ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య..!

అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆటో డ్రైవర్ ఆత్మహత్య

తండ్రి లేకుండా నేను బ్రతకలేను అంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ కుమారుడు

మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రాంతంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న సయ్యద్ ఆరీఫ్(48) అనే వ్యక్తి

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కాలుకి గాయాలు అవ్వడంతో, ఏ పని చేయకుండా ఇంటి వద్దే ఉంటున్న ఆరీఫ్

చేసిన అప్పులు తీర్చలేక మనస్తాపంతో పురుగుల మందు తాగానని కుటుంబ సభ్యులకు తెలుపగా, మీరు లేని జీవితం నాకొద్దు అంటూ, తండ్రి చేతిలో పురుగుల మందు లాక్కొని తాగిన అరీఫ్ చిన్న కుమారుడు సోయాన్

చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమించి మృతి చెందిన తండ్రి ఆరీఫ్, చికిత్స పొందుతున్న కొడుకు సోయాన్..