బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా గ్రూపు రెడ్ కమాండ్ ముఠా లక్ష్యంగా భద్రతా బలగాలు పెద్దఎత్తున ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో అధికారులతో సహా 64 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 81మంది అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. 75 రైఫిల్స్‌తో పాటు పెద్ద మొత్తంలో మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దాడుల సమయంలో సమీపంలోని 46 పాఠశాలలను మూసివేసినట్లు చెప్పారు.
Brazil police, soldiers kill 64 in Rio’s biggest anti-gang raid …
దేశంలోని అత్యంత శక్తిమంతమైన మాదకద్రవ్యాల అక్రమ రవాణా గ్రూపుల్లో రెడ్ కమాండ్ ఒకటిగా ఉంది. ఈ ముఠాను లక్ష్యంగా చేసుకునేందుకు దాదాపు ఏడాది పాటు ప్రణాళికలు రచించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. మంగళవారం నిర్వహించిన ఈ భారీ ఆపరేషన్‌లో దాదాపు 2,500 మంది పోలీసులు, సైనికులు పాల్గొన్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాయుధ వాహనాలతో పాటు హెలికాప్టల్లను కూడా ఉపపయోగించారు. కొన్ని గంటలపాటు జరిపిన కాల్పుల్లో నలుగురు భద్రతా అధికారులతో సహా 60 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 81 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. రియో చరిత్రలోనే ఇది అతిపెద్ద ఆపరేషన్ రాష్ట్ర గవర్నర్ క్లాడియో కాస్ట్రో అన్నారు. 93 రైఫిళ్లతో పాటు అర టన్నుకుపైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్ట్ చేశారు..మంగళవారం జరిగిన ఈ ఆపరేషన్‌లో నలుగురు అధికారులు మరణించారని రియో సివిల్ పోలీసులు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అధికారులే లక్ష్యంగా దాడి చేసేందుకు ముఠాలు డ్రోన్లు ఉపయోగించినట్లు తెలిపారు. అయినా వెనక్కి తగ్గకుండా ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయరని పేర్కొన్నారు. తమపై దాడులు చేసినా వారికి శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. దాడుల సమయంలో 46 పాఠశాలలను మూసివేసినట్లు నరగ విద్యాశాఖ తెలిపింది..
తీవ్రంగా ఖండించిన మానవ హక్కుల సంఘాలు
ఇదిలా ఉండగా పోలీసులు చేపట్టిన ఈ భారీ ఆపరేషన్‌ను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ తీవ్రంగా ఖండించింది. ఇది తమను భయభ్రాంతులకు గురిచేసిందని ఎక్స్‌లో పోస్ట్ చేసింది. దీనిపై స్వతంత్ర దర్యాప్తునకు పిలుపునిచ్చింది. ఈ హింసాత్మక ఘటన పెద్ద విషాదకరమని హ్యూమన్ రైట్స్ వాచ్ బ్రెజిల్ డైరెక్టర్ సీసార్ మయోజన్ అన్నారు. దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.
ఈ దాడికి ప్రతిస్పందనగా అనుమానిత ముఠా సభ్యులు ఉత్తర, ఆగ్నేయ రియోలో రోడ్లను దిగ్బంధించారని స్థానిక మీడియా నివేదించింది. అందుకోసం కనీసం 70 బస్సులను నియమించారని, దీనివల్ల గణనీయమైన నష్టం జరిగిందని నగర బస్సు సంస్థ రియో ఒనిబస్ తెలిపింది. ఇదిలా ఉండగా మంగళవారం మధ్యాహ్నం ఈ ఆపరేషన్‌పై మంగళవారం మధ్యాహ్నం ఈ ఆపరేషన్‌కు ప్రతిస్పందనగా ఉపాధ్యక్షుడు గెరాల్డో అనేక మంది మంత్రులు సమావేశమయ్యారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ రుయ్ కోస్టా బుధవారం రియోలో అత్యవసర సమావేశాన్ని పిలుపునిచ్చారు. ఆయనతో పాటు న్యాయ మంత్రి రికార్డో కూడా హాజరయ్యారు..