బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు విజ్ఞప్తి..

బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు విజ్ఞప్తి

పోలీసుల ఎదుట భగీరథ్ లొంగిపోవడంతో ముందస్తు బెయిల్ అవసరంలేదని, పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని హైకోర్టును కోరిన నిందితుడి తరపు న్యాయవాది..

పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను బండి సాయిభగీరథ్‌ ఉపసంహరించుకొన్నారు. పోక్సో కేసులో ఇప్పటికే నిందితుడు అరెస్టు అయిన నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నిరర్థకం అవుతుందని పేరొంటూ ఆయన తరఫు న్యాయవాది ఎన్‌ నవీన్‌కుమార్‌ హైకోర్టు రిజిస్ట్రీకి లేఖ రాశారు. భగీరథ్‌ అరెస్ట్‌ అయినందున ముం దస్తు బెయిల్‌ పిటిషన్‌లో ఏవిధమైన ఉత్తర్వులను జారీచేయాల్సిన అవసరం లేనందున పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతించాలని ఆ లేఖలో కోరారు. ఈ నేపథ్యంలో జస్టిస్‌ టీ మాధవీదేవి గురువారం విచారించే కేసుల జాబితాలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ ఉపసంహరణ క్యాటగిరీలో నమోదైంది..లైంగిక వేధింపుల అభియోగాలతో నమోదైన పోక్సో కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని భగీరథ్‌ వేసిన పిటిషన్‌పై ఈ నెల 21న శుక్రవారం అర్ధరాత్రి వరకు జస్టిస్‌ టీ మాధవీదేవి విచారించి తీర్పును ఈనెల 21కి వాయిదా వేశారు. తీర్పు వెలువరించే వరకు పిటిషనర్‌ను పోలీసులు అరెస్టు చేయకుండా తా తాలిక రక్ష ణ కల్పించాలని ఆయన తరఫు న్యాయవాది వినతిని న్యాయమూర్తి తిరసరించారు. బాధిత బాలిక వాంగ్మూలంలోని ఆరోపణల తీవ్రత దృష్ట్యా అరెస్ట్‌ నుంచి తక్షణ రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఆదేశాలు జారీ చేయబోమని తేల్చిచెప్పారు. ఈ పరిణామాల తర్వాత గత శనివారం బండి భగీరథ్‌ పోలీసులకు లొంగిపోవడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. నిందితుడు అరెస్టు కావడంతో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ నిరర్థకమని న్యాయవాది లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతిస్తూ న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులను జారీ చేయనున్నారు..