ఫోన్ ట్యాపింగ్ తో అనేక మంది జీవితాలను కేసీఆర్ నాశనం చేశారు.. బండి సంజయ్.

కరీంనగర్ లో మీడియా తో బండి సంజయ్…

*ఫోన్ ట్యాపింగ్ తో అనేక మంది జీవితాలను కేసీఆర్ నాశనం చేశారు*

*సిరిసిల్ల కేంద్రంగానే ఫోన్ ట్యాపింగ్ జరిగింది*

*దీనివెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసు*

*అనేక మంది ఉసురు పోసుకున్న దుర్మార్గుడు ప్రభాకర్ రావు*

*నాతోసహా బీజేపీ నేతలందరి ఫోన్లను ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ రావు*

*రేవంత్ రెడ్డి, ఉత్తమ్ తోపాటు జడ్జిలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికార్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు*

*అనుమానం పుట్టినంకే కేసీఆర్ పుట్టారు… అందుకే సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు*

*జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తే సీబీఐ విచారణ కోరాలి*

*గతంలో కాంగ్రెస్ కూడా ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు*

*కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఏసీబీ రాధాకిషన్ రావు వాంగ్మూలమిచ్చినా కేసీఆర్ కు ఎందుకు నోటీసులివ్వలేదు?*

*కేసీఆర్ కు, కేటీఆర్ కు నోటీసులివ్వడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?*

*మీ ఇద్దరి మధ్యనున్న రహస్య ఒప్పందమేంటి?*

*నాపై కేసీఆర్ ప్రభుత్వం 109 కేసులు పెట్టింది*

*సీఎం ఆఫీస్ ను అడ్డాగా చేసుకుని మేం ఫోన్లో మాట్లాడుకునే విషయాలన్నీ విన్న నీచుడు ప్రభాకర్ రావు*

*ప్రభాకర్ రావుకు రాచ మర్యాదలు ఇవ్వడం ప్రభుత్వం మానుకోవాలి*

*ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాడని నేను 100 సార్లు చెప్పిన*

*టెన్త్ హిందీ పేపర్ లీక్ పేరుతో అర్ధరాత్రి ఇంట్లోకి వచ్చి నేను నైట్ డ్రస్ తో ఉన్నానని తెలిసినా ప్రభాకర్ రావు ఆదేశాలతోనే నన్ను అరెస్ట్ చేశారు*

*ప్రభాకర్ రావుతో పోలీసులు ఇదే విషయంపై ఫోన్లో మాట్లాడుతుంటే స్వయంగా నేనే విన్న*

*కేసీఆర్ పాలనలో మీడియాసహా అందరి ఫోన్లను ట్యాప్ చేశారు*

*జర్నలిస్టులు సైతం వాట్సాప్, ఫేస్ టైం, సిగ్నల్ ద్వారా మాట్లాడుకునే దుస్థితి తీసుకొచ్చారు*

*వాట్సాప్ కాల్ ను కూడా ట్యాప్ చేసిన మూర్ఖుడు ప్రభాకర్ రావు*

*కేసీఆర్, కేటీఆర్ లను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది*

*కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరింది*

*అందుకే కేసీఆర్, కేటీఆర్ లకు నోటీసులివ్వడం లేదు*

*ప్రభాకర్ రావు అమెరికా నుండి ఇండియాకు వచ్చే ముందే కేటీఆర్ యూఎస్ వెళ్లింది నిజం కాదా?*

*కేటీఆర్ అమెరికా వెళ్లిన తరువాతే ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చి సరెండర్ అయ్యారు*

*బీఆర్ఎస్ ను గద్దె దించింది బీజేపీ పార్టీయే*

*కేసీఆర్ మెడలు వంచేలా పోరాటాలు చేసిందే బీజేపీ*
*బీఆర్ఎస్ తో అండర్ స్టాండింగ్ ఉంటే ఎందుకు పోరాటాలు చేస్తాం*

*ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణకు మేం సిద్ధం*

*కేంద్రం నేరుగా సీబీఐ విచారణ జరిపే అవకాశం లేదు కాబట్టే ఆగుతున్నాం*

*లేకుంటే ఎప్పుడో ఫోన్ ట్యాపింగ్ నిందితులందరినీ గుంజుకుపోయి చట్ట ప్రకారం బొక్కలో వేసే వాళ్లం*