ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్..!

*Breaking News*

ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసిన పోలీసులు

హన్మకొండ కు తరలించిన పోలీసులు

గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో అరెస్ట్ వరంగల్ సుబేదారి పోలీసులు.

తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy)ని శంషాబాద్ విమానాశ్రయంలో వరంగల్ సుబేదారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను వరంగల్ కు తరలించారు. కమలాపూర్ మండలంలో గ్రానైట్ క్వారీ వ్యాపారిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 308(2), 308(4), 352 కింద కేసులు నమోదు చేశారు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మనోజ్ రెడ్డి అనే వ్యక్తి కమలాపూర్ మండలంలోని వంగపల్లిలో గ్రానైట్ క్వారీ నిర్వహిస్తున్నారు. హుజూరాబాద్ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తనను రూ.50 లక్షలు ఇవ్వాలని బెదిరించినట్లు మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవీ సుబేదారీ పీఎస్‌లో చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే సుబేదారీ పోలీసులు శనివారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నారు.