*🔹రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం…*
*🔹కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి నోటీసులిచ్చేందుకు సిద్ధమైన సిట్*
*కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రికి ఫోన్ చేసిన సిట్ అధికారులు*
*మీ ఫోన్ ట్యాప్ అయ్యిందని వెల్లడించిన అధికారులు*
*విచారణకు సిద్ధంగా ఉండాలని కోరిన పోలీసులు*
*కేంద్ర మంత్రి వాంగ్మూలం తీసుకునేందుకు సమయం కోరిన పోలీసులు.
*షెడ్యూల్ చూసుకుని టైం చెబుతానన్న కేంద్ర మంత్రి.
*రేపో మాపో నోటీసులు జారీ చేయనున్న్ పోలీసులు.
*ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తొలుత తెరపైకి తీసుకొచ్చిన నేత బండి సంజయ్.
*కేసీఆర్ పాలనలో ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ పలుమార్లు ఆరోపించిన బండి సంజయ్.
*కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది, ప్రదాన అనుచరుల ఫోన్లను ట్యాప్ చేశారని పేర్కొన్న సంజయ్.
*కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అనేక ఉద్యమాలు, ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించిన సంజయ్.
*బీజేపీ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు బండి సంజయ్ తోపాటు కుటుంబ సభ్యుల, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ట్యాపింగ్ చేసిన గత ప్రభుత్వం.
*ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారం తెలుసుకుని అర్ధరాత్రి సంజయ్ నివాసంపై దాడి చేసి టెన్త్ పేపర్ లీక్ పేరుతో అరెస్ట్ చేసిన పోలీసులు.
*కరీంనగర్ ఎంపీ ఆఫీసులో 317 జీవో సవరణ దీక్ష జరగకుండా నిలువరించేందుకు శతవిధాలా ప్రయత్నించి భంగపడ్డ పోలీసులు.
*రాజకీయంగా ఎదుర్కోలేక ఫోన్ ట్యాప్ తో తనను దెబ్బతీసేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని పలుమార్లు సభల్లో, మీడియా వేదికల ద్వారా ఆరోపించిన బండి సంజయ్.
*భార్యాభర్తల సంభాషణలను కూడా ట్యాప్ చేసి నీచానికి ఒడిగట్టిందన్న సంజయ్.
*బండి సంజయ్ చెప్పిందంతా నిజమేనంటున్న సిట్ వర్గాలు.
*వందలాది మంది ఫోన్లు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిర్దారణ.
*సాక్షిగా బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునేందుకు సిద్ధమైన పోలీసులు.
*బండి సంజయ్ వాంగ్మూలంపై సర్వత్రా నెలకొన్న ఆసక్తి.