బీసీలకు 34% రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు..!

బీసీలకు 34% రిజర్వేషన్ల జీవోలను కొట్టేసిన హైకోర్టు.

బంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) సంచలన తీర్పు వెలువరించింది. రాబోయే 6 వారాల్లోపు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అదే సమయంలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. అదేవిధంగా మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని తేల్చి చెప్పింది..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు ఏపీ హైకోర్టు తీర్పుతో కీలక మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని ఆదేశించింది..స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 105, 1065ను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ జీవోలు సుప్రీంకోర్టు నిర్దేశించిన రిజర్వేషన్ల పరిమితికి విరుద్ధంగా ఉన్నాయంటూ పిటిషనర్లు వాదించారు. ఈ అంశంపై హైకోర్టు గతంలోనే తీర్పును రిజర్వ్ చేసింది..అలాగే ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పూర్తయిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్‌పైనా కోర్టు విచారణ జరిపింది. బీసీల జనగణన, సమగ్ర సర్వే పూర్తయిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌తో పాటు వార్డుల పునర్విభజన, గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు కూడా విచారణకు వచ్చాయి…బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం సమర్పించిన వాదన ప్రకారం.. 34 శాతం కోటా సమకాలీన బీసీ జనాభా లెక్కలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా నిర్ణయించినట్లు పేర్కొంది. హైకోర్టు తాజా ఆదేశాలతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్, షెడ్యూల్ తదితర అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తదుపరి నిర్ణయం…

గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌లలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో నంబర్ 105ను జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లపై పురపాలక శాఖ జీవో నంబర్ 1065ను జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి..రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఉపయోగించినట్లు, వాటి ఆధారాలను హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం మాత్రం బీసీల సమకాలిన జనాభా వివరాల కోసం నిర్వహించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా 34 శాతం రిజర్వేషన్లు నిర్ణయించినట్లు కోర్టుకు వివరించింది. తాజాగా హైకోర్టు జీవో 105, జీవో 1065లను కొట్టివేసింది. రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగ, న్యాయపరమైన పరిమితులను పాటించలేదని కోర్టు నిబంధనల నివేదికలు వెల్లడించాయి. దీనితో హైకోర్టు తీర్పుపై తదుపరి న్యాయపరమైన మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా, హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రారంభించారు. దీనితో ఒకవైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు 34 శాతం బీసీ రిజర్వేషన్లపై తీసుకునే తదుపరి న్యాయపరమైన నిర్ణయంపై ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది.