రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన బీసీ సంఘాలు చేపట్టిన బంద్‌..

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ బంద్​ కొనసాగుతోంది. ఆర్టీసీ డిపోల్లో ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాల నేతలు అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోరుతూ బంద్​ నిర్వహిస్తున్నారు.

రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణలో ఉద్యమం ఉధృత రూపం దాలుస్తోంది.. నేడు రాష్ట్ర బంద్‌కు బీసీ సంఘాల జేఏసీ పిలుపు ఇచ్చింది.. బంద్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి అన్ని రాజకీయ పక్షాలు, బీసీ సంఘాలు.. స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌తో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు రోడ్డుక్కుతున్నారు… రిజర్వేషన్ల అంశాన్ని 9వ షెడ్యూల్లో చేర్చి చట్ట సవరణ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.. ‘బంద్‌ ఫర్‌ జస్టిస్‌’ పేరుతో జరుగుతోన్న బీసీ సంఘాలు బంద్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి…

బీసీ బంద్ కారణంగా హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు.

బీసీ బంద్ కారణంగా హైదరాబాద్‌లో నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు.

తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో తిరగని ఆర్టీసీ బస్సులు.

ఎంజీబీఎస్‌ వద్ద 3గంటలగా ప్రయాణికుల పడిగాపులు.

హైదరాబాద్‌: పార్కింగ్‌లోనే నిలిచిపోయిన ఆర్టీసీ బస్సులు.

ఉప్పల్, చెంగిచర్ల డిపోలకే పరిమితమైన బస్సులు.

ఖమ్మంలో ఆర్టీసీ బస్ డిపో ఎదుట బీసీ ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన
ఖమ్మంలో ఆర్టీసీ బస్ డిపో ఎదుట బీసీ ఐకాస ఆధ్వర్యంలో ఆందోళన
ఖమ్మం: బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటున్న నాయకులు, కార్యకర్తలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొనసాగుతున్న బీసీ సంఘాలు బంద్.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో డిపోకే పరిమితమైన బస్సులు.

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్.

నల్గొండ: బంద్ కారణంగా నిలిచిపోయిన ఆర్టీసీ సేవలు..

*నల్లగొండ జిల్లా:-*

🔹ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కొనసాగుతున్న బంద్..

“బంద్ ఫర్ జస్టిస్” పేరుతో తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చిన బిసి జేఏసీ..

బస్ డిపోల ఎదుట బీసీ సంఘాలతో పాటు కాంగ్రెస్, బిఆర్ఎస్, వామపక్ష నేతలు ధర్నా..

*డిపో కే పరిమితమైన ఆర్టీసీ బస్సులు..నిర్మానుషంగా రోడ్లు.*

_• బస్సు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు.._

స్వచ్ఛందంగా విద్యాసంస్థలు, వ్యాపార,వాణిజ్య సముదాయాలు మూసివేత..

ఆటోలు,బైకులు మినహా స్తంభించిన రవాణా వ్యవస్థ..

42 శాతం బీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ బద్ధంగా ఇవ్వాలి అని డిమాండ్..

సూర్యాపేట జిల్లా
కోదాడ..

42 % బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బందు పిలుపునిచ్చిన అఖిలపక్షం..

బందులో భాగంగా కోదాడ ఆర్టీసీ డిపో నుండి బయటికి వెళ్ళని బస్ లు..

బస్టాండ్ లో బస్సుల కోసం ప్రయాణికుల
పడిగాపులు..

పండుగ సెలవలకు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన ప్రయాణికుల అవస్థలు..