యమ దీపం అంటే అకాల మృత్యు భయం,

యమ దీపం అంటే అకాలమృత్యు భయాలు, అపమృత్యు దోషాలు తొలగించమని ప్రార్ధిస్తూ యమధర్మరాజుని స్మరిస్తూ దీపం పెట్టడం. దీపావళి ముందు యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం అనేది అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా దీపం పెట్టడం అత్యంత శుభకరంగా చెబుతారు. మరణానికి అధిపతి అయిన యమున్ని స్మరిస్తూ వెలిగించే దీపం ఆరోగ్యం, దీర్ఘాయుష్షు ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా యమ దీపాన్ని ఎప్పుడు పెట్టాలి? యమ దీపం పెట్టేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమిటి? అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

యమ దీపం అంటే?.

యమ దీపం పెట్టడం అనే సంప్రదాయం ధన త్రయోదశి రోజున యముని గౌరవార్ధం పాటించే ఆచారం. ఈ దీపాన్ని యముని ఆశీర్వాదం పొందడానికి, అకాల మరణం నుంచి రక్షణ కలగాలని వెలిగిస్తారు.

యమ దీపం ఎప్పుడు పెట్టాలి?.

హిందూ పంచాంగం ప్రకారం 2025లో ధన త్రయోదశి తిథి అక్టోబర్ 18న మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి అక్టోబర్ 19న మధ్యాహ్నం 1 గంట 51 నిమిషాల వరకు కొనసాగుతుంది. కాబట్టి అక్టోబర్ 18, శనివారం రోజునే ధన త్రయోదశి జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు.

సుముహూర్తం.

అక్టోబర్ 18, శనివారం ఆశ్వయుజ బహుళ త్రయోదశి, ధన త్రయోదశి రోజు సాయంత్రం 6:30 గంటల నుంచి 7:30 గంటల లోపు యమ దీపం వెలిగించడానికి శుభ ముహూర్తం. ఈ సమయంలో యమ దీపం వెలిగించడం అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు.

యమ దీపం ఎక్కడ వెలిగించాలి?
జ్యోతిష్య శాస్త్ర పండితులు సూచించిన ప్రకారం ఇంటికి దక్షిణ దిశలో ఈ యమ దీపాన్ని వెలిగించాలి. పురాణాల ప్రకారం దక్షిణ దిక్కుకు అధిపతి యమధర్మరాజు. కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యమధర్మరాజు అనుగ్రహంతో కుటుంబ సభ్యులకు ఎలాంటి మృత్యు భయాలు దరి చేరవని విశ్వాసం.

యమ దీపం వెలిగించే విధానం!
యమ దీపం వెలిగించడంలో కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని శాస్త్రం చెబుతోంది. అవేంటో చూద్దాం.

యమ దీపాన్ని ఇలా ప్రార్ధించాలి!
ముందుగా ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ పోయాలి. యమ దీపం నాలుగు వైపులా ఉండాలి. నాలుగు వత్తులతో వెలిగించాలి. ఆ ప్రమిదను ఒక రావి ఆకుపై దక్షిణ దిక్కుగా ఉంచి దీపాన్ని వెలిగించాలి. దీపం వెలిగించే సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి యమ దీపానికి నమస్కరిస్తూ, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, కష్టాల నుంచి ఉపశమనం కలిగించమని ప్రార్థించాలి. ఈ ప్రార్థన వల్ల ఇంట్లో శాంతి, సంతోషం పెరుగుతుందని విశ్వాసం.

యమ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలో తెలుసుకున్నాం కదా. ఈ యమ దీపం వెలిగించడానికి కొన్ని నియమాలున్నాయి. అంటే యమ దీపం ఎప్పుడూ కూడా దక్షిణం వైపు వెలిగించాల్సి ఉంటుంది. ఎందుకంటే దక్షిణ దిశ అనేది యమ ధర్మరాజు దిశగా చెబుతారు. ఇలా చేస్తే దీపం వెలిగిస్తే యముడు సంతోషించి తద్వారా భయాల నుంచి ఉపశమనం కలిగిస్తుందట. అయితే యమ దీపం వెలిగించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే.. యమ దీపం నాలుగు వత్తులతో నలువైపులా వెలిగించాలి. యమ దీపాన్ని వెలిగించేందుకు నువ్వుల నూనె లేదంటే ఆవ నూనెను వినియోగించాలి.

దీపం వెలిగించి దానిని ఇంటి దక్షిణ దిశలో పెట్టాలి. కుటుంబ సభ్యులంతా కష్టాల నుంచి విముక్తి కలిగించాలని.. దీర్ఘాయుష్షుతో జీవించాలని ప్రార్థించాలి. ఇలా చేస్తే అకాల మృత్యు భయం ఉండదట. ఈ నియమాలు పాటిస్తూ యమ దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఇక దీపావళి పండుగ ధన్ తేరాస్‌తో ప్రారంభమవుతుందని తెలుసుకున్నాం కదా. ఈ రోజున సముద్రం నుంచి ధన్వంతరి అమృత కలశంతో దర్శనమిచ్చాడని చెబుతారు. కాబట్టి ఈ రోజున లోహ వస్తువులు కొంటే చాలా మంచిదని నమ్మకం. అలాగే స్తోమత ఉన్నవారు బంగారం, వెండిని కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది…