బీహార్‌ లో ఎన్డీఏ ప్రభంజనం.,,బీహార్ NDAదే.. సీఎం అభ్యర్థి ఎవరు?.

బీహార్ NDAదే.. సీఎం అభ్యర్థి ఎవరు?

బీహార్లో క్లియర్ పిక్చర్ వచ్చేసింది.

మొత్తం 243 స్థానాల్లో దాదాపు 200 స్థానాల్లో NDA ఆధిక్యంలో ఉంది. BJP 84, JDU 76 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. మహా కూటమిలో RJD 35, కాంగ్రెస్ 6 స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉన్నాయి. ఎజ్జేపీ (ఆర్వీ) 22 స్థానాల్లో ఆధిక్యంలో నిలుస్తూ 100 స్ట్రైక్ రేటుతో దూసుకెళ్తాంది. 200 సీట్లతో NDA ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది…

బీహార్ లో ప్రధాని మోదీ అస్త్రం ఫలించింది.. డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం అంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన మోదీ, నితీష్.. ఆ దిశగా ప్రజలను ఆకట్టుకున్నారు. దీంతో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. మెజారిటీ మార్క్‌ను దాటి 188 సీట్లలో లీడింగ్ లో కొనసాగుతోంది.. 243 స్థానాలకు జరుగుతున్న లెక్కింపులో మొదటి నుంచి బీజేపీ, జేడీయూ ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.. ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ నిలిచింది.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. NDA (బీజేపీ- జేడీయూ) 188 స్థానాల్లో, మహా కూటమి కేవలం
(ఆర్జేడీ-కాంగ్రెస్) 51 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు…

243 సీట్లలో బీజేపీ ప్రభంజనం..

బీజేపీ – 87

జేడీయూ – 76

ఆర్జేడీ – 37

లోక్ జనశక్తి పార్టీ – 19

కాంగ్రెస్ – 6

అసదుద్దీన్ ఒవైసీ పార్టీ AIMIM బలరాంపూర్‌లో ఆధిక్యంలో ఉంది

సీఎం అభ్యర్థిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది…