జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ గెలిచినట్లుగా ధృవీకరణ పత్రం ఇచ్చిన అబ్జర్వర్, రిటర్నింగ్ ఆఫీసర్ సాయిరామ్..
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు పోలైన ఓట్లు 98,988
బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు పోలైన ఓట్లు 74,259
బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి పోలైన ఓట్లు 17,061
24,729 ఓట్ల మెజార్టీతో మాగంటి సునీతపై నవీన్ యాదవ్ విజయం…
జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్ర : ప్రతి రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చారు. ఏ రౌండ్లోనూ బీఆర్ఎస్కు ఆధిక్యం దక్కలేదు. అధికారంలోకి వచ్చాక రెండు ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గెలిచింది. 2024 జూన్‌లో జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ గల్లంతైంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజారిటీని కాంగ్రెస్ పార్టీ సాధించింది..
నవీన్‌యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి మాట్లాడుతూ..
తనని నమ్మి ఓటు వేసిన అందరికీ నవీన్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారని అన్నారు. ప్రజలు వారి ఓటుతో వాటిని తిప్పికొట్టారని కొనియాడారు. నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదని అన్నారు. కేవలం తన గురించి దుష్ప్రచారం చేసి గెలవాలని బీఆర్ఎస్ చూసిందని ఆరోపించారు.
“సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. నాపై ఎన్నో దుష్ప్రచారాలు చేశారు.నియోజకవర్గ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తాను. పదేళ్లలో బీఆర్ఎస్ చేసిందేమీ లేకనే ప్రచారంలో చెప్పుకోలేదు. బెదిరిస్తే ప్రజలు ఓటు వేసే రోజులు ఎప్పుడో పోయాయి. ఎన్నికల్లో రిగ్గింగ్ రోజులు ఎప్పుడో పోయాయి. నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా అన్నారు..