రక్త ప్రవాహాన్ని తలపించేలా ‘బ్లడ్‌ రెయిన్‌..

మీరు ఎప్పుడైనా బ్లడ్‌ రెయిన్‌ను చూశారా? అవును ఇరాన్‌లో రక్తం రంగులో వర్షం కురిసింది. ఇరాన్ లోని రెయిన్ బో ఐలాండ్ లో ఎర్రని రంగులో వర్షం కురిసింది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై చేరగానే ఎరుపు వర్ణంలోకి మారిపోయింది. అది రక్తపు నీరులా ప్రవహించి సముద్రంలోకి చేరింది. ఈ ఎర్రని వర్షపు నీటితో బీచ్ మొత్తం ఎరుపు రంగులోకి మారి భయపెడుతోంది. ఏటా ఈ దృశ్యం చూసేందుకు లక్షలాదిగా పర్యాటకులు ఇరాన్ లో వాలిపోతుంటారు.

తాజాగా కొంతమంది టూరిస్టులు రెయిన్ బో ఐలాండ్ లో వర్షాన్ని ఎంజాయ్ చేశారు. ఎరుపు రంగులో రక్తాన్ని తలపించేలా పారుతున్న వరద నీటిలో గంతులు వేశారు. సముద్ర తీరంలోని గుట్టలపై పడిన వర్షం జలపాతంలా కిందకు దూకుతుంటే కేరింతలు కొట్టారు. ఈ ఎర్రని ప్రవాహాన్ని ఓ నెటిజన్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పకృతిలోని వింతలకు ఇదొక ఉదాహరణ అని, ఉన్నఫళంగా అక్కడికి చేరాలని ఉందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..

ఇరాన్‌లో జరిగిన ఒక అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఒకటి వైరల్‌గా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెటిజనులను ఆశ్చర్యపరిచింది. ఇరాన్‌లో లోని రెయిన్ బో ఐలాండ్ లో రక్తంలా ఎర్రని రంగులో వర్షం కురిసింది..టూర్ గైడ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షం అక్కడి కొండలపై ఎర్రటి ధూళితో చేరింది. ఆ తరువాత ఎర్ర రంగులో బీచ్‌లోకి ప్రవహిస్తోంది. మెరిసిపోయే ముదురు ఎరుపు రంగులో నీరు సముద్రంలోకి చేరుతుంది. అద్భుతమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు.
రెయిన్ బో తో ఐలాండ్‌లో వర్షాన్ని టూరిస్టులు ఎంజాయ్..

https://www.instagram.com/reel/DGYjmQJoKCf/?igsh=ZnU3Z2lkOW9yNHUw