ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా…

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ.. బీఆర్ఎస్ ఎంపీల ఆందోళన

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.

ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ్ మణిపూర్ అని రాసి ఉన్న ప్లకార్డులను ఎంపీలు ప్రదర్శించారు.

ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లును వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఎంపీలు శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా విత్ డ్రా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు, సేవ్ మణిపూర్ అని రాసి ఉన్న ప్లకార్డులను ఎంపీలు ప్రదర్శించారు.ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ప్రజాస్వామ్య ఫెడరలిజానికి ముప్పు అని బీఆర్ఎస్ ఎంపీలు పేర్కొన్నారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌పై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు అప్రజాస్వామికమని, దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ లోక్‌సభా నాయకుడు నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వ పనితీరును ఆయన తప్పుబట్టారు.