డేటింగ్ యాప్ లో పరిచయం.. దారుణ హత్యకు దారి…
విశాఖ – గాజువాకలో ప్రియురాలి హత్య ఘటనలో సంచలన నిజాలు..
2021లో డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం పెంచుకున్న నేవీ అధికారి రవీంద్ర
2024లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న రవీంద్ర.. అయినా మౌనికతో కొనసాగిన వివాహేతర సంబంధం
భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళడంతో మౌనికను ఇంటికి పిలుచుకున్న రవీంద్ర
వీరి మధ్య గొడవ తలెత్తడంతో పథకం ప్రకారం హత్య
గొంతు పిసికి హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేయాలని ముక్కలు ముక్కలు చేసిన రవీంద్ర
తల, చేతులను అడవివరం రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టి, మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, కాళ్ళను సూట్ కేసులో పెట్టిన రవీంద్ర
అనంతరం తప్పించుకునే మార్గం లేక తమకు లొంగిపోయాడని తెలిపిన గాజువాక పోలీసులు..
ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాప్ట్ టెక్నిషీయన్గా పనిచేస్తున్న రవీంద్రకు కైలాసపురం ప్రాంతానికి చెందిన వివాహితరాలు మౌనిక (28)తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో రవీంద్ర భార్య పుట్టింటికి వెళ్లడంతో ఆదివారం ప్రియురాలు మౌనికను తన ఇంటికి రమ్మని పిలిచాడు. రాత్రి వరకు ఇద్దరూ సఖ్యతగానే ఉన్నట్టు సమాచారం. అయితే అర్ధరాత్రి దాటిన తరువాత వారిద్దరి మధ్య చిన్న పాటి వాగ్వాదం జరిగిందని, క్రమేణా అది పెద్దది కావడంతో కోపోద్రిక్తుడైన రవీంద్ర ఇంట్లో ఉన్న కత్తిలో మౌనికను పొడిచి చంపేశాడు. అంతేకాకుండా మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి, సగ భాగాన్ని ఫ్రిజ్లో పెట్టేశాడు. మరో భాగాన్ని మూటకట్టి ఇంట్లోనే ఓ మూలన ఉంచాడు. అనంతరం నేరుగా పోలీసుస్టేషన్కు వెళ్లి తాను చేసిన నేరాన్ని వివరించి, లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు రవీంద్రను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా, తనను మౌనిక డబ్బుకోసం తీవ్రంగా వేధిస్తోందని, తట్టుకోలేక హతమార్చానని అంగీకరించినట్టు సమాచారం. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు..
2021లో డేటింగ్ యాప్ ద్వారా మౌనికతో పరిచయం పెంచుకున్న నేవీ అధికారి రవీంద్ర
2024లో వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న రవీంద్ర.. అయినా మౌనికతో కొనసాగిన వివాహేతర సంబంధం
భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్ళడంతో మౌనికను ఇంటికి పిలుచుకున్న రవీంద్ర
వీరి మధ్య గొడవ తలెత్తడంతో పథకం ప్రకారం హత్య
గొంతు పిసికి హత్య చేసి, మృతదేహాన్ని మాయం చేయాలని ముక్కలు ముక్కలు చేసిన రవీంద్ర
తల, చేతులను అడవివరం రోడ్డులో పెట్రోల్ పోసి తగలబెట్టి, మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి, కాళ్ళను సూట్ కేసులో పెట్టిన రవీంద్ర
అనంతరం తప్పించుకునే మార్గం లేక తమకు లొంగిపోయాడని తెలిపిన గాజువాక పోలీసులు తెలిపేరు…