పొలగోని రాములమ్మ మృతి బాధాకరం…కంకణాల వెంకట్ రెడ్డి .

– పొలగోని రాములమ్మ మృతి బాధాకరం

– రాములమ్మ దశదిన కర్మలో పాల్గొన్న కంకణాల వెంకట్ రెడ్డి

– కంకణాల వెంకట్ రెడ్డి
– బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు

చింతపల్లి ……..
చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన పొలగోని రాములమ్మ మృతి బాధాకరమని బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి అన్నారు.చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన పొలగోని రాములమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పొలగోని రాములమ్మ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.రాములమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు పొలగోని కృష్ణయ్య గౌడ్,పొలగోని నర్సింహా,తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు సోనగంటి గోవర్ధనాచారి,పి.ఏ.సి.యస్ డైరెక్టర్ తిరుమణి పాపయ్య,బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల పురుషోత్తం రెడ్డి, సిమర్ల శ్రీను యాదవ్,శివర్ల పర్వతాలు యాదవ్,దాసరి ముత్తయ్య యాదవ్,రెడ్డి పరమేష్, వీరమల్ల వెంకటయ్య గౌడ్,రాశిక పాండయ్య,ఉడుత వెంకటయ్య,గ్రామస్థులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.