జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డును వెంటనే విడుదల చేయాలి..
గాంధీ జయంతి రోజున పోస్ట్ కార్డు ఉద్యమాన్ని విజయవంతం చేయాలి..
టీయూడబ్ల్యూజే 143దేవరకొండ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని ఆంజనేయులుయాదవ్, ప్రధాన కార్యదర్శి మధుసూదనా చారి,
కోశాధికారి సముద్రాల వేణు..
దేవరకొండ……..
జర్నలిస్టుల ఆరోగ్య భద్రత విషయంలో ప్రస్తుత ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరి వీడేలా ఒత్తిడి తెచ్చే క్రమంలో భాగంగా టియుడబ్ల్యూజే 143 రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు దశల వారి ఉద్యమం విజయవంతం చేయాలని దేవరకొండ టియుడబ్ల్యూజే143 దేవరకొండ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని ఆంజనేయులుయాదవ్, ప్రధాన కార్యదర్శి మధుసూదనాచారి,
కోశాధికారి సముద్రాల వేణు ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా అక్టోబర్ 2 జయంతి పురస్కరించుకొని దేవరకొండ తో పాటు అన్ని మండల కేంద్రాలలో గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టి పోస్టుకారులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు. వారం రోజుల పాటు 8 వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ మిత్రులు అందరూ 50 పైసల పోస్ట్ కార్డ్ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కై వెంటనే ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా క్యాష్ లెస్ హెల్త్ కార్డులు జారీ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ హెచ్ ఎస్ కాకుండా ఈ జె హెచ్ ఎస్ స్కీమ్ ను పునరుద్ధరించి మెరుగైన సేవలు అందించాలని, దేవరకొండ నియోజకవర్గంలో అన్ని మండలాలకు సంబంధించిన జర్నలిస్టులు తమ పూర్తి వివరాలను పంపిస్తూ..
మీ పేరు..పని చేసే సంస్థ పేరు.
జిల్లా పేరు.
వివరాలు రాసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం( సీఎంఓ )
6వ అంతస్థు .
డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం.
హైదరాబాద్ – 500022 చిరునామాకు పోస్ట్ కార్డులను పంపాలని కోరారు. గాంధీ జయంతి రోజున డిండి మండల కేంద్రంలో నిర్వహించే పోస్ట్ కార్డు ఉద్యమానికి డిండి మండల జర్నలిస్టులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.