మాగంటి సునీతకు చెప్పులు చూపించిన నవీన్ యాదవ్ అనుచరులు..!

మాగంటి సునీతపై చెప్పులు చూపించిన నవీన్ యాదవ్ అనుచరులు

మాగంటి సునీతపై, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసి కొట్టిన శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ అనుచరులు…

జూబ్లీహిల్స్ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని కృష్ణా న‌గ‌ర్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. కృష్ణాన‌గ‌ర్, శ్రీన‌గ‌ర్ ప‌రిధిలోని ప‌లు పోలింగ్ కేంద్రాల్లో ఇత‌ర ప్రాంతాల నుంచి మ‌హిళ‌ల‌ను తీసుకొచ్చి కాంగ్రెస్ నేత‌లు దొంగ ఓట్లు వేయిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఫేక్ ఓట్లు, రిగ్గింగ్ చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత కృష్ణాన‌గ‌ర్‌లో నిర‌స‌న‌కు దిగారు..కాంగ్రెస్ నేత‌లు నిబంధ‌న‌లు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నార‌ని సునీత మండిప‌డ్డారు. దొంగ ఓట‌ర్ల‌కు పోలీసులు స‌హ‌క‌రిస్తున్నారు. తాము దొంగ ఓట‌ర్ల‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుని పోలీసుల‌కు, ఎన్నిక‌ల అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌న్నారు. చ‌నిపోయిన వృద్ధురాలి పేరుతో కూడా ఓటేశారు. ఎన్నికల‌ క‌మిష‌న్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు అని మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లతో దౌర్జన్యాలకు పాల్పడుతుంది, మా పార్టీ కార్యకర్తలను కొట్టి, తిరిగ వారి మీదనే కేసులు పెడతామని నవీన్ యాదవ్ అనుచరులు బెదిరిస్తున్నారు అని మాగంటి సునీత పేర్కొన్నారు.

మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో మాగంటి సునీతపై చెప్పులు చూపించిన నవీన్ యాదవ్ అనుచరులు

మాగంటి సునీతపై, బీఆర్ఎస్ నాయకులపై దాడి చేసి కొట్టిన శ్రీశైలం యాదవ్, నవీన్ యాదవ్ అనుచరులు అంటు brs శ్రేణులు ఆరోపిస్తున్నారు..

మరోపక్క..

దొంగ ఓట‌ర్ల‌ను అడ్డుకున్న బీఆర్ఎస్ నేత‌ల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి న‌వీన్ యాద‌వ్ తండ్రి శ్రీశైలం యాద‌వ్ రోడ్డుపై రౌడీయిజానికి దిగారు. దొంగ ఓట్లను అడ్డుకున్న బీఆర్ఎస్ నాయకులపై పోలీసుల ముందే శ్రీశైలం యాదవ్ దాడికి పాల్ప‌డ్డారు..యూసుఫ్‌గూడ‌లోని మ‌హ‌బూబ్ ఫంక్ష‌న్ హాల్ వ‌ద్ద ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. దొంగ ఓట‌ర్ల‌ను అడ్డుకున్న బీఆర్ఎస్ అభ్య‌ర్థి మాగంటి సునీత‌, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప‌ట్ల పోలీసులు అమ‌ర్యాద‌గా ప్ర‌వ‌ర్తించారు. దీంతో పోలీసుల‌పై బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు మండిప‌డ్డారు. పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయ‌గా, మాగంటి సునీత‌ను అక్క‌డ్నుంచి పంపించారు. కానీ రౌడీయిజానికి దిగిన శ్రీశైలం యాద‌వ్‌ను మాత్రం పోలీసులు అరెస్టు చేయ‌లేదు. పైగా ఆయ‌న‌కు పోలీసులు భ‌ద్ర‌త క‌ల్పించారు. దీంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అడుగడుగునా ఘర్షణ వాతావరణం నెల‌కొంది…