నేటి పంచాంగం..నమస్కారం _ యొక్క అంతరార్థం ఏమిటి??

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
🌺పంచాంగం🌺
శ్రీరస్తు – శుభమస్తు – అవిఘ్నమస్తు,

తేదీ … 12 – 11 – 2025,
వారం … సౌమ్యవాసరే ( బుధవారం )
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం,
దక్షిణాయనం,
శరదృతువు,
కార్తీక మాసం,
బహుళ పక్షం,

తిథి : *అష్టమి* తె3.58 వరకు
నక్షత్రం : *ఆశ్రేష* రా12.16 వరకు
యోగం : *శుక్లం* మ2.26 వరకు
కరణం : *బాలువ* సా4.27 వరకు,
తదుపరి *కౌలువ* తె3.58 వరకు,

వర్జ్యం : *మ1.14 – 2.49*
దుర్ముహూర్తము : *ఉ11.21 – 12.06*
అమృతకాలం : *రా10.41 – 12.16*
రాహుకాలం : *మ12.00 – 1.30*
యమగండం : *ఉ7.30 – 9.00*
సూర్యరాశి : *తుల*
చంద్రరాశి : *కర్కాటకం*
సూర్యోదయం : *6.06*
సూర్యాస్తమయం : *5.21*

*_నేటి మాట_*

నమస్కారం _ యొక్క అంతరార్థం ఏమిటి??.
ప్రతి నిత్యం మనం చేసే పని,
మనం చేతులు జోడించి భగవంతునికి నమస్కరిస్తాము,
అసలు నమస్కారమంటే ఏమిటి? అది మనకు తెలియదు, తెలిసినా బయటకు చెప్పలేము!!…

ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు కలిపి భగవంతునికి అర్పించటమే నిజమైన నమస్కారం…
‘ న మ ‘ అనగా ‘నాదికాదు’ అని అర్థం….
అంటే సర్వమూ భగవంతునిదే అన్న నిరంహకార భావానికి చిహ్నం నమస్కారం…
కర్మలను ప్రారంభించే ముందు మనము కర్మలకు నమస్కరించాలి.
‘ తస్మై నమః కర్మణే ‘ ….
‘ ఓ కర్మ దేవతా! నాచే పవిత్రమైన కర్మలను మాత్రమే చేయించు’ అని ప్రార్థించాలి!!…

నమస్కారం అంటే ఏదో రెండు చేతులు జోడించడం కాదు.
తలపెట్టిన కర్మ విజయవంతం అయ్యేలా ఆశీర్వదించమని భగవంతుని ప్రార్థించడమే నమస్కారం యొక్క అంతరార్థం…🙏

*_🌺శుభమస్తు🌺_*
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏