*🔹బీఆర్ఎస్ ఫిర్యాదుపై తెలంగాణ స్పీకర్ చర్యలు*
_• పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు…_
*• నోటీసులు పంపిన స్పీకర్ కార్యాలయం..*
బీఆర్ఎస్ ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని ఆదేశం
సుప్రీం తీర్పు మేరకు విచారణ చేపట్టనున్న స్పీకర్..
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం
చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో నిన్న ఐదుగురికి నోటీసులు పంపించారు. నేడు మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.
కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాగా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, తెలంగాణ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది…
ఇక, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం..
మిగిలిన ఐదుగురు ఎమ్మెల్యేలకూ స్పీకర్ కార్యాలయం నోటీసులను సిద్ధం చేస్తుండగా, వారికీ త్వరలోనే జారీ చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డిపై స్పీకర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలంటూ జూలై 25న తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో న్యాయ నిపుణులతో స్పీకర్ ప్రసాద్‌కుమార్, శాసనసభావ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై నిర్ణయం.. పూర్తిగా స్పీకర్ పరిధిలోనిదేనని అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి..