నేడు బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.

నేడు బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశం.

_• ఆరు నెలల తర్వాత తెలంగాణ భవన్ కు రానున్న కేసీఆర్._

మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్ లో కెసిఆర్ అధ్యక్షతన ప్రారంభం కానున్న సమావేశం

ఈ సమావేశానికి 400 మంది పార్టీ కీలక నేతలకు ఆహ్వానం

పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు మాజీఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు డిసిసిబి డిసిఎంఎస్ చైర్మన్లు జెడ్పీ మాజీ చైర్మన్ లను ఆహ్వానించారు.

ఈ భేటీలో పార్టీని సంస్థగతంగా బలోపేతం చేయడంపై చేపట్టాల్సిన కార్యకలాపాలపై కేసీఆర్ తనఆలోచనలు వివరిస్తారు

బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.

పార్టీ సభ్యత్వ నమోదు సంస్థాగత నిర్మాణంపై దృష్టి.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం.

లోకల్ బాడీ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సమాయత్తం చేసేలా వ్యూహరచన చేయనున్నారు.

గులాబీ క్యాడర్ ను కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటంలో సిద్ధం చేయనున్నారు.

ఈనెలాఖరులో భారీ బహిరంగ సభ నిర్వహించాలని ప్లాన్ చేసిన కేసీఆర్.

ఏప్రిల్ 27 పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రతినిధుల సభ నిర్వహించే ఆలోచన.

సెప్టెంబర్ అక్టోబర్ లో పార్టీ అధ్యక్ష ఎన్నికలు.

అధ్యక్ష ఎన్నికల సమయంలోనే భారీ బహిరంగ సభ నిర్వహించే ప్లాన్.

గత 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చేసిన పోరాటాల పై సమీక్ష… భవిష్యత్తు వ్యూహంపై దిశా నిర్దేశం.

రుణమాఫీ, రైతు భరోసా, లగిచర్ల భూ పోరాటం, హైడ్రా ఆగడాలపై ఉద్యమం, రైతు ఆత్మహత్యలపై, ఆటో కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీలు.

గురుకులాల విద్యార్థుల ఆత్మహత్యలు సమస్యలపై పోరాటం.

పార్టీ క్యాడర్, సోషల్ మీడియా కార్యకర్తల టార్గెట్గా ప్రభుత్వం పెడుతున్న కేసులపై పోరాటం.

వివిధ కీలక అంశాలపై భవిష్యత్తు పార్టీ నిర్మాణంపై కేసీఆర్ క్యాడర్ కు దిశా నిర్దేశం చేస్తారు.