*సూర్యాపేట జిల్లా..*
వరంగల్ లో జరుగనున్న BRS రజతోత్సవ సభకు వెళ్ళడానికి ఎడ్ల బండ్లతో సిద్ధమవుతున్న సూర్యాపేట రైతులు..
BRS రజతోత్సవ సభకు మేముసైతం అంటున్న రైతన్నలు..
సూర్యాపేట నుండి తరలివెళ్లేందుకు ముస్తాబవుతున్న ఎడ్లబండ్లు..
కెసిఆర్ మాటలు వినాలని.. కొండంత అభిమానంతో మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సారధ్యంలో స్వచ్చందంగా వెళతామంటున్న రైతులు..
కెసిఆర్ సారును కలవాలి.. మా గోడు వెళ్ళబుచ్చుకోవాలి..
గత పదేండ్లు BRS పాలనలో ఆనందంగా వున్నాం..
అన్నిరంగాలతో పాటు రైతంగాన్ని కెసిఆర్ కంటికి రెప్పలా కాపాడుకున్నడు..
మా జగదీష్ రెడ్డి కాళేశ్వరం నీళ్లతో ఎండిన చెరువులు నింపి సూర్యాపేటను సస్యశ్యామలం చేసిండు..
మండువేసవిలో ఎండిన చెరువులు అలుగులు పోసినయి..
పంటలు బాగా పండినాయి.. అప్పులు తీర్చుకున్నాం.. నాలుగు పైసలు చేతుల పట్టుకున్నాం..
గత పదేండ్లు కెసిఆర్ పాలనలో వలసలు ఆగి.. ఇతర రాష్టాలనుంచే ఇక్కడికే వలసలు వచ్చే పరిస్థితి వుండే..
ఇప్పుడు నీళ్లులేక పంటలు సరిగా పండక మళ్ళీ రైతులు కూలి పనుల కోసం వలసపోయే పరిస్థితి వచ్చింది..
కాంగ్రెస్, రేవంత్ మాయమాటలకు మోసపోయి గోసపడుతున్నాం..
ఈ కాంగ్రెస్ వచ్చినాకనించి ఏడాదిన్నర పాలనలోనే ఇంత కరువు వచ్చింది..
నీళ్లులేక పొలాలు ఎండిపోయినయి.. చేతికొచ్చిన కాస్త పంటకు మద్దతు దరలేకుండా పోయింది..
అప్పులెట్ల తీర్చాలే.. పెట్టుబడెట్ల ఎల్లాలే.. ఇల్లేట్ల గడవాలే..
చెరువులు కుంటలు ఎండినయి.. సాగుతో పాటు తాగునీరు కష్టమైంది..
అని ఆవేదన వెళ్ళబుచ్చుతున్న రైతులు..
అందుకే మాకు మళ్ల కెసిఆర్ పాలనే కావాలె.. అంటూ సూర్యాపేట రైతులు దీమాగా చెబుతున్నారు..
BRS 25 ఏండ్ల పండుగకు వారం రోజుల ముందుగానే బయలుదేరతామంటున్నారు..
సభ ప్రారంభం నాటికీ చేరుకునేలా ముందస్తుగా సిద్ధమవుతున్నామంటుండ్రు..
బండెనక బండి కట్టి అన్న పాటను తలపించేలా సూర్యాపేట రైతులు ఎడ్ల బండ్లను ముస్తబుచేస్తూన్నరు..
ఈ నెల 22 న సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూర్ (ఎస్) మండలంలోని నెమ్మికల్ దండు మైసమ్మ తల్లికి మొక్కి బయలుదేరుతామంటున్నరు….