తిరుమల :
ఏపీలోని తిరుమల శ్రీవారి ఆలయంలో పది రోజుల పాటు సాగిన వైకుంఠ ద్వార దర్శనాలు రేపు అర్ధరాత్రి ఏకాంత సేవతో ముగియనున్నాయి. డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఈ ఉత్తర ద్వార దర్శనాల ద్వారా ఇప్పటికే లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఎల్లుండి నుంచి శ్రీవారి ఆలయంలో యథావిధిగా ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, ఇతర సేవలు తిరిగి ప్రారంభం కానున్నాయని టీటీడీ(TTD) అధికారులు వెల్లడించారు…
కుటుంబానికి నాలుగు టికెట్లు మాత్రమే
ఒక్క కుటుంబానికి 1+3 సభ్యులు మొత్తం నలుగురికి మాత్రమే టికెట్ బుకింగ్కు అనుమతి ఉంటుంది. టికెట్ల బుకింగ్లో దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఆధార్ ధృవీకరణ, మొబైల్ నంబర్ వంటి వివరాలు తప్పనిసరి అని టీటీడీ పేర్కోంది. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వడ్ విధానంలో భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది. తద్వారా ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్ల కోసం భక్తులు క్యూలైన్ లో నిరీక్షించే సమస్య తొలగిపోతుందని తెలిపింది. ఈ నూతన విధానాన్ని నెల రోజులపాటు ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్టు టీటీడీ స్పష్టం చేసింది.
గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959