కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి..

సూర్యాపేట జిల్లా… గరిడేపల్లి మండలంలో సిపిఐ నిరసన..

ప్రజలను నమ్మించి మోసం చేయడంలో సిద్ధహస్తుడు నరేంద్ర మోడీ..

కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి..

సిపిఐ డిమాండ్

కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం పెంచిన డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలకు నిరసనగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ బండలతో నిరసన వ్యక్తం చేసినారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం లో అధికారం లో వున్న బిజెపి ప్రభుత్వం, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నమ్మించబోమే పెంచ భూమిని ప్రజలను నిర్మించి ఓట్లు వేయించుకొని ఎన్నికలు గెలిచిన తర్వాత తపాల వారీగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలను నమ్మకంలో మోసం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలను పెంచి పేద ప్రజల పైన భారం మోపిందని
ఆయన అన్నారు.
భారతదేశం వెలిగిపోతుంది పేదరికం లేని దేశంగా

మారుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల సందర్బంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాట్లాడిన మాటలు అన్నీ నీటి బుడగల లాగా అయ్యాయని ఆయన అన్నారు. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలు పెంచి పేదవారి నడ్డి విరచడమేనా మీరు చెప్పే మాటలకు అర్ధం అని ఆయన అన్నారు.
నిత్యావసర ధరలు పెరిగి ప్రజలుఆర్థికంగా సతమతమవుతున్నటువంటిఈ పరిస్థితులలో వంటగ్యాసు ధర పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి ప్రజలను ఇంకొంచెం ఆర్థికంగా అణిచివేతకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

విదేశీ పెట్టుబడులకు కార్పొరేట్ శక్తులకు బడా బూర్జువా బడా భూస్వామ్య వ్యవస్థకు తలవంచి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను అణచివేతకు గురి చేస్తుందని ఆయన అన్నారు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పట్టించుకోకుండా, నిత్యవసర వస్తువుల ధరలు పెంచి,ప్రజల పై మరింత ఆర్థిక భారాన్ని మోపుతూ, వున్నారని అన్నారు. పెంచిన వంటగ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమం లో సిపిఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, ఏఐటీయూసీ జిల్లా నాయకులు త్రిపురం సుధాకర్ రెడ్డి, సిపిఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, , కుందూరు వెంకటరెడ్డి, షైక్ నబిసాహెబ్, ఈద చిన్న భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.