చంద్రగ్రహణం వివరణ…గ్రహణ నిర్ణయములు..సంపూర్ణ చంద్ర గ్రహణం…

చంద్రగ్రహణం వివరణ…

గ్రహణ నిర్ణయములు

సంపూర్ణ చంద్ర గ్రహణం…

మొదటి చంద్ర గ్రహణము 07-09-2025 ఆదివారం రాత్రి 07-09-2025 భాద్రపద పూర్ణిమా ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించును. ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కుంభరాశిలో శతభిషం మరియు పూర్వాభాద్ర నక్షత్రాలలో ఇది సంభవించును కావున కుంభరాశివారు దీనిని వీక్షించగూడదు. మరుసటి రోజు యధావిధిగా చంద్రగ్రహణ శాంతి జరుపుకొనవలెను…

గ్రహణ స్పర్శకాలం రాత్రి 9-50

ఉన్మీలన కాలం రాత్రి గం. 10-58

గ్రహణ మధ్యకాలం రాత్రి గం. 11-41

నిమీలన కాలం రాత్రి గం. 12-24

గ్రహణ మోక్షకాలం రాత్రి గం. 1-31

ఆద్యంత పుణ్యకాలం గం. 3-41 ని.లు.

ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో భాద్రపద మాసం పౌర్ణమి రోజున ఈ సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అలాగే మన దేశంతో పాటు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో కూడా ఈ చంద్ర గ్రహణం (Lunar Eclipse 2025) చూడొచ్చు. ఈసారి చంద్ర గ్రహణం (Chandra Grahanam) సెప్టెంబర్ 7న రాత్రి 9:58 గంటలకు ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ 8వ తేదీ తెల్లవారుజామున 1:26 గంటలకు ముగియనుంది. ఈ చంద్ర గ్రహణం రోజు చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు. కాబట్టి చంద్రుడిని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఇది ఈ ఏడాది రెండోది అంటే చివరి చంద్ర గ్రహణం..చంద్ర గ్రహణం ఏర్పడటానికి 9 గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది. అంటే.. సెప్టెంబర్‌ 7వ తేదీ మధ్యాహ్నం 12.57 గంటల నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులు మూసివేస్తారు, పూజలు చేయరు. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను, ఇంటిని శుభ్రం చేసి పూజలు చేస్తారు….