అయితే పేరు మార్చుకో….జావేద్ అక్తర్ అనే పేరును ‘రామ్ పాల్’గా మార్చుకో…!

షారుఖ్ ఖాన్ నటించిన ‘స్వదేశ్’ సినిమాలోని ‘పల్ పల్ హై భారీ’ పాట గురించి మాట్లాడిన సందర్భంగా జావేద్ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశారు. మనసులోని రావణుడిని బయటకు పంపిస్తే.. రాముడు మనసులోనే ఉంటాడు అనే పాటలోని భావాన్ని ప్రస్తావిస్తూ.. రాముడు అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, నైతిక విలువలు, జీవన విధానానికి ప్రతీక అని అన్నారు. ప్రతి భారతీయుడి రక్తంలో రాముడు ఉన్నాడని, వారు ఏ మతాన్ని అనుసరించినా రాముడి జీవన సందేశం అందరికీ వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో జావేద్ అక్తర్ వ్యాఖ్యలపై సాజిద్ రషీదీ రియాక్షన్ ఇప్పుడు రాజకీయ, మతపరమైన వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి…

అయితే పేరు మార్చుకో.

జావేద్ అక్తర్ వ్యాఖ్యలను మౌలానా సాజిద్ రషీదీ తప్పుబట్టారు. జావేద్ అక్తర్ తనను తాను నాస్తికుడిగా చెప్పుకుంటూ ఇప్పుడు రాముడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక వాణిజ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోపించారు. బాలీవుడ్‌లో పాటలు అమ్ముడుపోవాలంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వస్తుందని విమర్శించారు. ఆయనకు నిజంగా రాముడిపై అంత విశ్వాసం ఉంటే జావేద్ అక్తర్ అనే పేరును ‘రామ్ పాల్’గా మార్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఒకేసారి రెండు భిన్నమైన సిద్ధాంతాలకు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నించడం సరికాదని, తన మతపరమైన గుర్తింపుపై తాను గర్వపడుతున్నానని, జావేద్ అక్తర్ కూడా తన వైఖరిని స్పష్టంగా వెల్లడించాలని సూచించారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా సినిమా నిర్మాణం, రచన, పాటల రంగాల్లో ఉన్నారని ప్రస్తావిస్తూ.. ఒకరి పనిని మరొకరు ప్రశంసించుకోకపోతే వ్యాపారం ఎలా సాగుతుందని ప్రశ్నించారు..

“మీరు కచ్చితంగా నిష్కపటమైన వైఖరి తీసుకోవాలి”: శ్రీరాముడిపై చేసిన వ్యాఖ్యల విషయంలో జావేద్ అక్తర్‌ను విమర్శించిన ఏఐఏఏ అధ్యక్షుడు రషీది.