చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల రద్దీ..!

*యాదాద్రి భువనగిరి జిల్లా:*

* చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద కొనసాగుతున్న వాహనాల రద్దీ.

* ప్రభుత్వం సంక్రాంతి సెలవులు పాఠశాలలకు రేపటి నుండి ఇవ్వడంతో ముందుగానే సొంత గ్రామాలకు బయలుదేరిన ఆంధ్ర వాసులు.

* హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ..రాష్ట్రంలో సంక్రాంతి పండగకు వారం రోజులు వరుస సెలవులు రావడంతో శుక్రవారం సాయంత్రం నుండి తమ సొంత ఊర్లకు వెళ్లేవారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.

తెల్లవారుజామున ఈ రద్దీ మరింత పెరిగింది. దీంతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద సొంత వాహనాలలో పండగకు ఊరు వెళ్లే వారితో రద్దీగా మారింది. సొంత ఊర్లకు వెళ్లేవారితో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి రద్దీగా మారింది.

గమనిక.. మీ ప్రాంతాల్లో A TO Z వార్తలు ఏదైనా..మాకు సమాచారం అందించండి.
వాట్సాప్..+91 91330 57959