కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్..

కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్..

మదనపల్లె

సంచలనం రేకెత్తించిన మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో ఆదివారం ఏ20 నిందితుడిని 2వ పట్టణ పోలీసులు అరెస్టుచేశారు. డిఎస్పి పావని తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె ఎస్బిఐ కాలనీలోని గ్లోబల్ మల్టి స్పెషాలిటీ ఆసుపత్రిలో విజయవాడకు చెందిన జమున కిడ్నీ తొలగించి అమ్మేశారు. కిడ్నీ తొలగించే క్రమంలో వైద్యం వికటించడంతో జమున మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో డయాలసిస్ టెక్నీషియన్ బాలు అలియాస్ బాలరంగడు, కాకర్లసత్య, పద్మ, సూరిబాబు, డా.ఆంజనేయులు, పార్థసారథి లపై గత ఏడాది నవంబర్16న మానవ అవయవాల అక్రమ రవాణా కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. మొత్తం 26 మంది పై కేసు నమోదు చేయగా అందులో 11మందిని మాత్రమే పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నిందితులను ఒక్కొక్కరినే అరెస్టు చేస్తున్నారు. ఆదివారం కేసులో ఎ20 నిందితుడిగా ఉన్న కడప కు చెందిన ఓటి అసిస్టెంట్ నవీన్ ను అరెస్ట్ చేసి వైద్యపరీక్షల అనంతరం రిమాండ్ కు తరలించారు..