24 గంటల్లో ఆయన రాజీనామా చేయకపోతే.. వచ్చే నెల 2 నుంచి ముంబైలో దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే ప్రకటించారు. ఆ తర్వాత క్రమంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు విస్తరించేలా చేస్తామన్నారు.
ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా.. భారీగా ఓటర్లను తొలగించారంటూ సీజేపీ అభ్యంతరం తెలుపుతోంది. ఇదే ప్రధానాంశంగా ‘ఎలక్షన్ కమిషన్ ఠీక్ కరో’ పేరిట దేశవ్యాప్తంగా ప్రచారం చేపడుతోంది. ‘సర్’ ప్రక్రియ పూర్తైన రాష్ట్రాల్లో వెలువడిన గణాంకాల ఆధారంగా.. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాల నుంచి సుమారు 13 కోట్లకు పైగా పేర్లు తొలగించారని సీజేపీ ఆరోపిస్తోంది. ఇలా పెద్దఎత్తున ఓట్లను తొలగించడంతో ఓటు హక్కుపై ప్రభావం చూపుతుందని అభిజీత్ దీప్కే ఆరోపించారు. ప్రతి ఓటును చట్టబద్ధంగా, పారదర్శకంగా, సమర్థవంతమైన సమీక్షకు లోబడి ఉందని ఈసీ వివరించాల్సిన బాధ్యత ఉందని ఆయన పేర్కొన్నారు.