హైదరాబాద్: శాసనసభ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో చోటుచేసుకున్న కుట్రపూరిత సంఘటనలపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి దోషులను శిక్షించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాసనసభలో వెల్లడించారు.
సమావేశాల తొలిరోజు సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశించి దుర్భాషలాడిన ఘటనతో పాటు, దళితులు నడిచిన నేలను శుద్ధి చేసిన ఘటనలపై శాసనసభలో తీవ్ర ఆందోళన వ్యక్తమైందని సీఎం తెలిపారు. ఈ ఘటనల నేపథ్యంలో స్పీకర్కు శాసనసభ అండగా నిలిచిందని, మానసిక ధైర్యం కోల్పోవద్దని విజ్ఞప్తి చేసిందన్నారు.
బుధవారం శాసనసభలో జరిగిన సుదీర్ఘ చర్చకు సమాధానమిచ్చిన సీఎం.. స్పీకర్కు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సభాపతి మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు.
కొంతమంది ఉసిగొల్పబడిన వ్యక్తులు అధికారులపై దాడులకు పాల్పడటంతో పాటు సభాపతి స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. సభాపతి తల్లిని అవమానించేలా వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు.
“సభాపతికి జరిగిన అవమానం సమాజానికి జరిగిన అవమానమే” అని సీఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ సమాజం దోషులను ఉపేక్షించదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపేందుకు అనేక మార్గాలున్నాయని, అయితే సభాపతిని అవమానించేలా వ్యవహరించడం ఏమాత్రం సమర్థనీయం కాదన్నారు.
శాసనసభలో జరిగిన ఘటనను ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా సీఎం అభివర్ణించారు. సభాపతిని అవమానించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 7 నుంచి శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలపై విస్తృతంగా చర్చించాలని ప్రభుత్వం భావించిందని సీఎం తెలిపారు. విద్యారంగ సమస్యలు, ధరణిలో అక్రమాలు, 22(ఎ) భూములు, ప్రతిపక్షాలు లేవనెత్తే ఇతర ప్రజా సమస్యలపై చర్చించాలని నిర్ణయించామని చెప్పారు. అయితే ప్రజా సమస్యలపై చర్చ జరగకుండా కొందరు అడ్డుకున్నారని సీఎం ఆరోపించారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...