సీఎం మార్పు వార్తలు,, కాంగ్రెస్ పార్టీ సీనియర్స్ నాయకులు ఇచ్చిన లీక్ లేనా..!!?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న బిజెపి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్, సంచలనాన్ని సృష్టించాయి… ఈ ప్రకటనతో కాంగ్రెస్ పార్టీలోనే మరో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి… ఇది ఆయనతో కాంగ్రెస్ లోనే పలువురు సీనియర్ నాయకులు చెప్పించారంటూ రేవంత్ రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో గృహం ఎత్తుతున్నారు… ఏది ఏమైనా ఇది చిలికి చిలికి గాలివానలా మారింది.. ఇది ఎంతవరకు దారితీస్తుంది అనేది త్వరలో తేలుతుంది..

జూన్‌ లేదా డిసెంబర్‌లో మార్చేస్తారని ఆయనకు రాహుల్, ప్రియాంకలు అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెప్పుకొచ్చారు..కాంగ్రెస్ అంతర్గత విషయాలపై ఆయన ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నారో … ఎవరు మాట్లాడిస్తున్నారో కాంగ్రెస్ లోనే ఓ స్పష్టత కనిపిస్తోంది. మహేశ్వర్ రెడ్డి ఎన్నికలకు ముందు వరకూ కాంగ్రెస్ నేత. కాంగ్రెస్ పరిస్థితి బాగోలేదని ఆయన బీజేపీలో చేరిపోయారు. తర్వాత రేవంత్ పార్టీ అధికారంలోకి తెచ్చారు. దాంతో ఆయన మంత్రి పదవి పోయిందే అని వచ్చింది.

ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులతో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. రేవంత్ వర్గీలు ఆరోపిస్తున్నారు.. ఇదంతా కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షంగా పరోక్షంగా చేస్తున్నా వ్యవహారమే.. అంతేకాకుండా మంత్రి పదవి ఇస్తే రేపే పార్టీలోకి వస్తానని ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి రాయబారం నడిపారని ఆరోపిస్తున్నారు.. బిజెపి ఎమ్మెల్యే రాకను రేవంత్ వద్దనుకున్నారు అంటూ అదే కోపంతో ఇలా మాట్లాడించారని ఆరోపణలు గుర్తిస్తున్నారు…. అందుకే ఆయనకు కోపం ఉండి ఉండవచ్చు.. ఈ క్రమంలో రేవంత్ పై దాడి చేస్తూనే ఉన్నారు. ఆయనతో ఈ మాటలు చెప్పించింది.. రేసులో ఉన్నారని ఆయన ప్రకటించిన వారేనని రేవంత్ రెడ్డి వర్గం అనుమానిస్తున్నాయి…

రేవంత్ వర్గీల మాటలు..
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం అనేది అవాస్తమని రేవంత్ ఢిల్లీ పర్యటనలకు వెళ్ళేరు రేవంత్ వర్గీయులు చెప్తున్నారు ఆర్థమైపోతుంది అంటు… హైడ్రా కూల్చివేతల తర్వాత కూడా రాహుల్ ను కలిశారు. వయనాడ్ లో ప్రియాంక గాంధీ నామినేషన్ కి వెళ్లే సమయంలో కాంగ్రెస్ కండువాను రేవంత్ కప్పారు. యాక్టివ్ గా పాల్గొన్నారు. రేవంత్‌ రెడ్డికి హైకమాండ్ వద్ద పలుకుబడి అనూహ్యంగా పెరుగుతోంది. అంటూ ఆయన వర్గీయులు చెప్పుకొస్తున్నారు.. ఎక్కడ కాంగ్రెస్లో ఆయన మార్కు తగ్గడం లేదు. ఆయన ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ బీజేపీని సవాల్ చేస్తున్నరు తెలివైన రాజకీయంగా హైకమాండ్ భావిస్తోంది అంటున్నారు. రేవంత్ పాతుకుపోవడం ఇష్టం లేని సీనియర్లు ఇక్కడ అడ్డగోలు వ్యూహాలతో బీఆర్ఎస్, బీజేపీ నేతలతో తప్పుడు పుకార్లు పుట్టిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు ఓ అభిప్రాయానికి వస్తున్నాయి… ఏది ఏమైనా సిఎం రేవంత్ రెడ్డి కి పదవీ గండ తప్పేలా లేదు.. అంటు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నది.