తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేశామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి షాకింగ్ కామెంట్స్..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హామీలు ఆరు గ్యారంటీలు అమలు చేశామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీచే సెప్టెంబర్ 17 2023 లో మేమిచ్చిన హామీలను తెలంగాణలో అమలు చేశామని రేవంత్ అన్నారు..మహారాష్ట్రలో ప్రధాని మోదీ తెలంగాణలో కాంగ్రెస్ గ్యారంటీల అమలుపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే..మేం నిజాలు చెబుతూనే ఉంటాం..అందుకే నేను మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారెంటీల అమలుపై నిజాలు చెప్పడానికి ఇక్కడకు వచ్చా న్నారు.
దేశంలో మహారాష్ట్రలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగాయి. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రైతు సంక్షేమాన్ని మరిచాయి. నల్లచట్టాలు తెచ్చి అదానీ,అంబానీలకు మేలు చేయాలని మోదీ భావించారు. తెలంగాణలో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం. తెలంగాణలో 25 రోజుల్లో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్లు మాఫీ చేశామని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 50 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని వివరించారు. సామాజిక న్యాయం అందించేందుకు తెలంగాణలో కులగణన చేపట్టామని సీఎం తెలిపారు.
మోదీ పై ఫైర్..
ప్రధాని స్థాయిలో ఉండి అసత్య ప్రచారాలు చేయడం హుందాతనం అనిపించుకోదని హితవు పలికారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు ఉదయం ఆయన మహారాష్ట్రకు వెళ్లారు. అక్కడ నిర్వహించిన ఓ సమావేశంలో రేవంత్ రెడ్డి.. ప్రధాని టార్గెట్గా విమర్శలు చేశారు. తెలంగాణ ప్రజలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై ప్రధాని మోదీ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, అవి అమలుకు యోగ్యం కాని హామీలంటున్నారని మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అందిస్తున్న సుపరిపాలనను చూసి జీర్ణించుకోలేకే ప్రధాని మోదీ ఇలా ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు..