కేసీఆర్ మాకు ఇచ్చిన నజరానా అప్పులు
7 లక్షల కోట్లు అప్పులు చేసిండు…
కాళేశ్వరం ప్రాజెక్టు లాంటి తప్పులు చేసిండు…
రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నెలకు రూ. 18 వేల నుంచి రూ.18,500 కోట్లు..
నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రతి నెలా రూ. 6500 కోట్లు అప్పులు కట్టాల్సిందే..
రిజర్వ్ బ్యాంకులో పడగానే వారే గుంజుకుంటారు.
నా బంధువులు, ఆత్మబంధువులైన ఉద్యోగుల జీత భత్యాల కింద రూ. 6500 కోట్లు.
ఇక మిగిలింది రూ. 5 వేల నుంచి రూ.5500 కోట్లు మాత్రమే.
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఇందులో నుంచే తీయాలి.
1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ‘12 ఏళ్ల మీ యుక్త వయస్సు వృథా అయ్యింది. నిరుద్యోగ సమస్య తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. తెలంగాణ వచ్చాక నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతోందని యువత భావించింది. మొదటి సంవత్సరంలోనే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ ఒక్కటే. దేశ ఆర్థిక పురోగతి విద్యా రంగంతోనే సాధ్యం. విద్యారంగానికి రూ.21,650 నిధులు కేటాయించాం. ఇప్పటి వరకు 57,946 ఉద్యోగ నియామకాలు చేపట్టామని గర్వంగా చెబుతున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు..