ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ ..

సీఎం రేవంత్‌తో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ
సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక రాజకీయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన, మంత్రి కొండా సురేఖకు సంబంధించిన కుటుంబ వ్యవహారం, పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, క్రమశిక్షణ ఉల్లంఘన అంశాలను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు సమాచారం.
ఇటీవల పార్టీలో నేతల మధ్య నెలకొన్న విభేదాలు, బహిరంగ వ్యాఖ్యలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం పార్టీ వ్యవహారాలపై అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది..

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. పిడుగుల ముప్పు..; https://r9telugunews.com/telugu-rain-effect/*కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ సమరభేరి… కేటీఆర్ పిలుపు..!* https://r9telugunews.com/ktr-23/*ఏపీలోని వారందరికి గుడ్‌న్యూస్.. అక్టోబర్‌ నుంచి కొత్త విధానంలో ఫించన్‌ పంపిణీ!* https://r9telugunews.com/ap-ntr-bharosa-pension-scheme-spouse-categor/