జమ్మూకశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేయాలనే డిమాండ్లపై కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మద్దతు.. బీజేపీ ఆరోపణలు..!

జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ మసూద్‌ వెళ్లడంపై రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. జమ్మూకశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేయాలనే డిమాండ్లపై కాంగ్రెస్‌ పార్టీ తన వైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. 2020 దిల్లీ అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న షర్జీల్‌ ఇమామ్‌ విడుదలకు సంబంధించిన నినాదాలపైనా కాంగ్రెస్‌ స్పందించాలని కోరింది. దిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని గోడలపై ‘ఫ్రీ కశ్మీర్‌’, ‘రిలీజ్‌ షర్జీల్‌ ఇమామ్‌’ వంటి నినాదాలు రాసి ఉన్నాయని రవిశంకర్ ఆరోపించారు. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ ఎంపీ ఇమ్రాన్‌ మసూద్‌ అక్కడికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ పార్టీ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. మసూద్‌ కేవలం ఎంపీ మాత్రమే కాదని, ఉత్తర్‌ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా ఉన్నారని గుర్తుచేశారు. కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరు చేయాలనే డిమాండ్‌ను కాంగ్రెస్‌ సమర్థిస్తుందా? షర్జీల్‌ ఇమామ్‌ విషయంలో ఆ పార్టీ వైఖరి ఏమిటి? అని ప్రశ్నల వర్షం కురించారు…. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో అల్లర్లు జారుతున్న సమయంలో ఇప్పుడు కావాలని కాశ్మీర్ అంశాన్ని తెరపై తెచ్చారంటూ పలువురు ఆరోపిస్తున్నారు.